Tamilnadu: షాకింగ్‌.. కలుషిత ఆహారం తిని 128 మంది విద్యార్థులకు అస్వస్థత

తమిళనాడులో షాకింగ్ ఘటన జరిగింది. ఎక్సెల్ అనే కళాశాలలో కలుషిత ఆహారం తిని 128 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అక్టోబర్ 26న రాత్రి భోజనం తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
128 college hostel students fall ill in Tamilnadu

128 college hostel students fall ill in Tamilnadu

ఈ మధ్య స్కూల్, కాలేజీల్లో ఫుడ్‌ పాయిజన్(food-poison) అయ్యి విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడు(tamilnadu) లో ఇలాంటి దారుణమే జరిగింది. ఎక్సెల్ అనే కళాశాలలో కలుషిత ఆహారం తిని 128 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అక్టోబర్ 26న రాత్రి భోజనం తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా విద్యార్థులు వాంతులు, విరేచనాలు కడుపు నొప్పితో బాధపడుతున్నారు.

Also read: దారుణం.. పొలాల్లోకి లాక్కెళ్లి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రే*ప్

Food Poison In Tamilnadu College Hostel

ఎక్సెల్ కళాశాలకు చెందిన హాస్టళ్లలో మొత్తం 3,757 మంది బాలురు, బాలికలు ఉంటున్నారు. ఉమ్మడి వంటగదిలోనే వాళ్లందరికీ ఆహారం తయారు చేసి మెస్‌లకు పంపిణీ చేస్తున్నారు. అయితే అక్టోబర్ 26న రాత్రికి విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ముందుగా నలుగురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు వచ్చారు. దీంతో వాళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాతి రోజు 55 మంది విద్యార్థులకు ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఇక అక్టోబర్ 27న మరో 69 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. 

Also read: బ్రేక్‌అప్ అయిన ఉద్యోగికి 12 రోజులు సెలవులు.. CEO ట్వీట్ వైరల్

మొత్తంగా 128 మంది విద్యార్థులు అస్వస్థకు గురవ్వడంతో నవంబర్ 2 వరకు హాస్టల్‌ మెస్‌లు మూసివేయాలని.. కాలేజ్‌కు సెలవులు ప్రకటించాలని కలెక్టర్‌ దుర్గామూర్తి కళాశాల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు విద్యార్థులు తిన్న ఆహార నమునాలను సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే ప్రాథమిక విచారణలో నీటి నిల్వ ట్యాంకులను సరిగా శుభ్రం చేయనట్లు ఆహార భద్రత శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.  

Also Read: ఈసారి రిపబ్లిక్ డే డబుల్ ధమాకా.. 2026 జనవరి 26కి ఇండియా చరిత్రలో ఫస్ట్ టైం!

Advertisment
తాజా కథనాలు