Republic Day 2026: ఈసారి రిపబ్లిక్ డే డబుల్ ధమాకా.. 2026 జనవరి 26కి ఇండియా చరిత్రలో ఫస్ట్ టైం!

ఇద్దరు దేశాధినేతలు కర్తవ్య పథ్‌లో జరిగే 2026 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా రానున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తోపాటు కొత్తగా నియమితులైన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.

New Update
Republic Day chief guests

భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు 2026కి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రానున్న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో ఈసారి ఇద్దరు ముఖ్య అతిథులు హాజరుకానున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏదో ఓ దేశాధినేతని ఇండియా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి యూరోపియన్ యూనియన్ (EU) అత్యున్నత నాయకత్వాన్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని భారత్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Also Read :  బీహార్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. దూసుకొస్తున్న సైలెంట్ వేవ్.. ఆ కూటమికి ఊహించని షాక్?

Republic Day 2026 Chief Guests

తొలిసారిగా బహుళ-దేశాల కూటమికి చెందిన నాయకులు భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఘనత దక్కుతుంది. ఇద్దరు దేశాధినేతలను ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను ముఖ్య అతిథులుగా రానున్నారు. కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో EU అగ్ర నాయకత్వం పాల్గొనడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించనుంది.

భారత్-ఈయూ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం, బంధాలకు ఈ ఆహ్వానం నిదర్శనంగా నిలుస్తోంది. 2026 జనవరి 26న జరిగే ఈ వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌(Ursula von der Leyen) తోపాటు కొత్తగా నియమితులైన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. వచ్చే ఏడాది జనవరిలో న్యూఢిల్లీలో జరగబోయే భారత్-ఈయూ సమ్మిట్‌తో ఈ నాయకుల పర్యటన దాదాపుగా ఒకే సమయంలో జరుగుతుందని సమాచారం.

ఈ పర్యటన సందర్భంగా, ఇరుపక్షాల నాయకులు ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతికత, భద్రత రంగాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా, భారత్-ఈయూ మధ్య చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఉచిత వాణిజ్య ఒప్పందంపై కూడా పురోగతి సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం 2025 చివరి నాటికి కొలిక్కి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Also Read :  ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి..ఐఎండీ తాజా హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు