/rtv/media/media_files/2025/04/10/EV3G4vGEnxNAQKL9Lwr9.jpg)
Menstruating Class 8 student in Tamil Nadu made to take exam outside classroom
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. పీరియడ్స్‌లో ఉన్న ఓ దళిత విద్యార్థిని పరీక్ష రాసేందుకు వస్తే.. ఆమెను తరగతి బయటే కూర్చోబెట్టారు. నెలసరి శుభ్రతపై ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తూ.. అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే కొందరు మాత్రం మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూర్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఏప్రిల్ 5న మొదటిసారిగా రుతుక్రమం మొదలైంది.
Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్ బిలియనీర్ కేసులో భయంకర నిజాలు!
Menstruating Class 8 Student In Tamil Nadu
రెండ్రోజుల తర్వాత ఏప్రిల్ 7న ఫైనల్ పరీక్షల రాసేందుకు ఆమె స్కూల్‌కు వచ్చింది. కానీ ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు లోపలికి అనుమతించలేదు. తరగతి బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. ఆ తర్వాత ఆమె ఇంటికెళ్లాక తన తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో బుధవారం ఆ బాలిక తన తల్లితో కలిసి స్కూల్‌కు వచ్చింది. కానీ అప్పుడు కూడా ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు.
Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!
తన కూతురికి జరిగిన ఘటనను తల్లి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. దీంతో పాఠశాల యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి. బాలిక తల్లి విద్యాశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఇదిలాఉండగా మధ్యప్రదేశ్‌లో కూడా మేరఠ్‌లో 11వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా పీరియడ్స్ వచ్చాయి. శానిటరీ నాప్‌కిన్ కావాలని అడగగా.. ఉపాధ్యాయుడు ఆమెను బయటికి పంపించేశాడు. దీంతో అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: తీహార్ జైలుకు తహవూర్ రాణా.. పటిష్ట భద్రత ఏర్పాటు!
Also Read : ఓటీటీలోకి వీరుడి కథ.. ‘ఛావా’ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
periods | tamilnadu | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu