Working Hours: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ?

L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్‌ ఉద్యోగులు వారానికి 90 గంటల పనిచేయాలని అనడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రపంచంలో అత్యధిక పనివేళలు ఉన్న దేశాలేంటి ? తక్కువ పని వేళలున్న దేశాలేంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Work

Work

గతంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి ఉద్యోగులు వారానికి 70 గంటల పాటు పనిచేయాలని చెప్పడం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌.ఎన్ సుబ్రహ్మణ్యన్‌ ఏకంగా వారానికి 90 గంటల పనిచేయాలని అన్నారు. వీలైతే ఆదివారం కూడా పనిచేయాలని.. ఆ రోజు సెలవు ఉంటున్నందుకు చింతిస్తున్నానని కూడా అన్నారు. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై దీపికా పదుకొనే, హర్షా గోయేంక, ఆనంద్ మహీంద్రా లాంటి వారు కౌంటర్ ఇచ్చారు. 

Also Read: సీఎం అతిషికి 4 గంటల్లోనే రూ.10 లక్షలు విరాళం

ప్రస్తుతం పనివేళల అంశం చర్చనీయాంశమయ్యింది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మనిషికి మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు. అయితే ప్రపంచంలోని వారానికి ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిస్థానంలో ఉన్న దేశం భూటాన్. ఇక్కడ జనాభా తక్కువగానే ఉంటుంది. కానీ వీళ్లు వారానికి 54.4 గంటలు పనిచేస్తున్నారు. రెండో స్థానంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఉంది. ఈ దేశంలో అక్కడి ఉద్యోగులు వారానికి 50.9 గంటలు పనిచేస్తున్నారు.   

మూడో స్థానంలో సౌత్‌ ఆఫ్రికాలో ఉన్న లెస్‌తో ఉంది. ఇక్కడి ఉద్యోగులు వారానికి 50.4 గంటలు పనిచేస్తున్నారు. వారానికి 48.6 గంటలు పాటు పనిచేస్తున్న నాలుగో దేశంగా కాంగో నిలుస్తోంది. అయిదో స్థానంలో ఉన్న దేశం ఖతార్‌. ఇక్కడి ఉద్యోగులు సగటున వారానికి 48 గంటలు పనిచేస్తున్నారు. ఇక మన భారత్‌ 13వ స్థానంలో ఉంది. భారతీయులు సగటున వారానికి 46.7 గంటలు పనిచేస్తున్నారు.51 శాతం జనాభా 49 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ పనిచేస్తున్నారు. 

Also Read: ఉద్యోగం కోసం డిజిటల్ చీటింగ్.. చివరికి ఏమైందంటే?

ఇక అతితక్కువ గంటలు పనిచేసే దేశాల్లో ఆస్ట్రేలియా ఖండంలోని వనౌతు అనే దేశం మొదటిస్థానంలో ఉంది. ఈ దేశంలో ఉద్యోగులు కేవలం వారానికి 24.7 గంటలు మాత్రమే పనిచేస్తారు. రెండో స్థానంలో కిరిబతి అనే దేశం 27.3 గంటలు, మిక్రోనేషియా అనే దేశం 30.4 గంటల పనివేళలతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు