Delhi Elections: ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలోకి దిగనున్న ఎన్సీపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కూడా పోటీ చేయనుంది. 25 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

New Update
Atishi, Arvind Kejriwal and Ajit pawar

Atishi, Arvind Kejriwal and Ajit pawar

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఈ క్రమంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కూడా పోటీ చేయనుంది. 25 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ?

 ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇప్పుడు వీటి సరసనా ఎన్సీపీ (అజిత్ పవార్) కూడా చేరనుంది. అంతేకాదు బీజేపీతో పొత్తు లేకుండానే ఒంటరిగా పోటీ చేయనుంది. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఉంటున్న ప్రాతాలపై ఫోకస్ పెట్టింది. కొన్ని ప్రాంతాల్లో తమ అభ్యర్థులను కూడా ఫైనల్ చేసింది. ఢిల్లీలో కూడా తమ పార్టీని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది . 

Also Read: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన!

అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ పోటీ చేయడం ఇది మొదటిసారి కాదు. 2020లో కూడా ఈ పార్టీ 5 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. ఇక 2023లో ఎన్సీపీ పార్టీ చీలిపోయిన సంగతి తెలిసిందే. అజిత్‌ పవర్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి తన బాబాయ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేయడంతో పార్టీ రెండుగా విడిపోయింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి మహాయుతి కూటమిలో భాగంగా బరిలోకి దిగి విజయం సాధించింది. అయితే ఈసారి కూడా ఎన్సీపీ (అజిత్ పవార్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది . 

Also Read: మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు రూ.8,500: కాంగ్రెస్

Advertisment
తాజా కథనాలు