/rtv/media/media_files/2025/01/12/cBF5UUMUVGiNWQg5FWAH.jpg)
Ponguleti Srinivas reddy Car
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కారుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాహనం అదుపుతప్పింది. అయితే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తప్పడంతో సిబ్బంది వెంటనే ఆయన్ని మరో కారులో ఖమ్మంకు తరలించారు.
/rtv/media/media_files/2025/01/12/nXj9KvCEmTNdInVhRUWs.jpg)
ఇదిలాఉండగా ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా పెను ప్రమాదం తప్పింది. వరంగల్ పర్యటనకు వెళ్తున్న ఆయన కాన్వాయ్‌లో పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. జనగామ లోని పెంబర్తి కళాతోరణం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్‌ఐ, చెన్నకేశవులు, డ్రైవర్లకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్కకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.