దారుణం.. క్రిస్మస్ వేడుకలలో టెర్రరిస్ట్ ఎటాక్.. 15 మంది మృతి!

జర్మనీలో క్రిస్మస్ వేడుకలకు ముందు టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. మాగ్డెబర్గ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా సౌదీ అరేబియాకి చెందిన డాక్టర్‌ తలీబ్‌ తన బీఎండబ్ల్యూ కారుతో జనాలపైకి దూసుకెళ్లాడు. 15 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలపాలయ్యారు. 

New Update
german christmas market

german christmas market Photograph: (german christmas market)

జర్మనీలో క్రిస్మస్ వేడుకలకు ముందు టెర్రరిస్ట్ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. మాగ్డెబర్గ్ అనే ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా.. ఓ డాక్టర్ తన బీఎండబ్ల్యూ కారుతో బీభత్సం సృష్టించాడు. మార్కెట్లో షాపింగ్ చేస్తున్న జనాలపైకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో వంద మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. 

Also Read: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం

మార్కెట్ ప్రాంతం రక్తసిక్తం

ఘటన జరిగిన సమయంలో మార్కెట్లో వందల మంది జనం ఉన్నారు. దీంతో మాగ్డెబర్గ్ మార్కెట్ ప్రాంతం రక్తసిక్తంగా మారింది. ఈ ప్రమాదంతో రిస్క్యూ సిబ్బంది అప్పమత్తమైంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. బాధితులకి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడి చేసిన వ్యక్తిని జన్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

నిందితుడు సౌదీ అరేబియాకి చెందిన 50 ఏళ్ల డాక్టర్‌ తలీబ్‌గా పోలీసులు గుర్తించారు. తలీబ్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాద ఘటనపై సౌదీ అరేబియా విచారం వ్యక్తం చేసింది. ఇక ప్రమాదంపై స్థానిక ప్రభుత్వ ప్రతినిధి మథియాస్ మాట్లాడారు. నిందితుడు తన ఉద్దేశపూర్వకంగానే కారుతో మార్కెట్‌లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తోందన్నారు. 

శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో నిందితుడు ఎటువైపు నుంచి వచ్చాడో తెలియదని.. కానీ అత్యంత వేగంగా మార్కెట్‌లోకి వచ్చాడని అన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే కచ్చితంగా కావాలనే చేసినట్లు అనిపిస్తుందన్నారు. ఇక ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Also Read:  చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఏమవుతుంది?

Also Read: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు