Delhi: రాహుల్ గాంధీపై నమోదైన కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ

గురువారం పార్లమెంటులో జరిగిన కొట్లాటలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై కేసు నమోదు అయింది. రాహుల్ తోసేయడం వల్లనే బీజేపీ ఎంపీ గాయపడ్డారని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు దాన్ని తాజాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. 

author-image
By Manogna alamuru
New Update
10

పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్ష సభ్యులు నిరసనలతో గందరగోళం ఏర్పడింది. అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్‌ను అవమానించిందని అధికార పార్టీ ఎంపీలు కూడ ఆందోళన నిర్వహించారు. ఈ మొత్తం ఇన్సిడెంట్‌లో పార్లమెంట్‌లోకి వస్తున్న అధికార పార్టీ ఎంపీలను విపక్ష పార్టీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. మెట్ల దగ్గర నిల్చుని ఉన్న ఒక బీజేపీ ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారని..ఆయన వెళ్ళి ప్రతాప్ చంద్రపై పడ్డారు. దీంతో కిందపడటంతో ప్రతాప్ చంద్ర తలకు గాయం అయ్యిందని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.  అలాగే కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ నేతలపై ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు కర్రలతో దాడి చేశారని.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గాయపడ్డారని ఫిర్యాదులో చెప్పారు. 

క్రైమ్ బ్రాంచ్‌కు..

అయితే ఇరు వర్గాలు వీటిని పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ఇందులో రాహుల్ గాంధీపై మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు కూడా అయింది. ఇప్పుడు ఈ కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు ట్రాన్సఫర్ అయింది. రాహుల్ గాంధీపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ కూడా చేపట్టారని తెలుస్తోంది. 

మరోవైపు  రాహుల్‌గాంధీ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నోన్ కొన్యాక్ ఆరోపించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఇది తనను ఎంతగానో బాధించిందని.. రాహుల్ తనకు చాలా దగ్గర నిలబడడం తన మనసు కలిచివేసిందని చెప్పారు. అంతేకాకుండా రాహుల్ తనపై గట్టిగా కూడా అరిచారని ఆవేదన వ్యక్తం చేశారు కొన్యాక్. 

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌కు మళ్ళీ షాక్..ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు