TG News: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫెమా చట్టం కింద కేటీఆర్‌ను అరెస్ట్ చేసి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 3 రెట్ల జరిమానా విధించనున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా లేకపోలేదని పలువురు న్యాయనిపుణులు చెబుతున్నారు. ముగ్గురు నిందితులుగా.. ఇక ఏసీబీ పెట్టిన కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగగా.. కేటీఆర్ కు ఊరట లభించింది. డిసెంబర్ 27కు మరోసారి విచారణను వాయిదా వేసింది. అలాగే ఈనెల 30 వరకు కేటీఆర్‌ను ఏసీబీ అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం.. కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. రాజకీయ సన్యాసం తీసుకుంటా.. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ - కాగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముఖ్యంగా రైతు భరోసా అంశం పై ఇరు పార్టీలు వాధించుకున్నాయి. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలు తెచ్చుకోండి అని.. డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం పెడతానని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. ఏకకాలంలో ఒకటే పెన్ స్ట్రోక్‌తో రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారన్నారు. అంతేకాకుండా డిసెంబర్ 7న స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్‌లో రుణమాఫీ కోసం రూ. 49 వేల 500 కోట్లు అని చెప్పారన్నారు.