/rtv/media/media_files/2025/03/07/paW7QKI4xFXge17NKDai.jpg)
Indian football star Sunil Chhetri comes out of international retirement
భారత ఫుట్‌బాల్‌లో ఒక పెద్ద పరిణామం చోటుచేసుకుంది. 40 ఏళ్ల స్టార్ ఫుట్‌బాల్ దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి మళ్లీ గ్రౌండ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఈ మేరకు మార్చి 25న బంగ్లాదేశ్‌తో జరగనున్న AFC ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్ మూడవ రౌండ్‌లో ఆడనున్నాడు.
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
ఈ మేరకు ఇదే విషయాన్ని భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఎక్స్ ద్వారా వెల్లడించింది. “సునీల్ ఛెత్రి తిరిగి వచ్చాడు! కెప్టెన్, నాయకుడు, లెజెండ్ మార్చిలో FIFA ఇంటర్నేషనల్ విండో కోసం భారత జాతీయ జట్టుకు తిరిగి వస్తాడు” అని ఇండియన్ ఫుట్‌బాల్ ట్వీట్ చేసింది.
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!
గతంలో రిటైర్మెంట్
ఇదిలా ఉంటే 40 ఏళ్ల ఛెత్రి జూన్ 2024లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశం తరపున అతని చివరి ఆట FIFA ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కువైట్‌తో జరిగింది. ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ గోల్ స్కోరర్ జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఛెత్రి తన గోల్స్ ఖాతాలో మరిన్ని గోల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 19 సంవత్సరాలకు పైగా తన కెరీర్‌లో అంతర్జాతీయ వేదికపై 150 మ్యాచ్‌ల్లో ఛెత్రి మొత్తం 94 గోల్స్ చేశాడు. భారత ఫుట్‌బాల్ జట్టు తరపున ఆడిన అతిపెద్ద ఆటగాళ్లలో ఒకరిగా గౌరవించబడ్డాడు.
ఇక అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్ అయినప్పటికీ.. ఛెత్రి ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు FC తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో అతడు అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. దాదాపు 12 గోల్స్‌తో అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాళ్లలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక ఏఐఎఫ్‌ఎఫ్ విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని త్వరలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.