/rtv/media/media_files/2025/03/07/k4IdgVpzMi9Xfl4mD5Tp.jpg)
Woman Dead Body Found With 10 Nails Hammered Into Feet in Bihar Nalanda
రోజు రోజుకూ దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు చెలరేగిపోతున్నారు. తాజాగా ఓ మహిళను అతి దారుణంగా హింసించి చంపారు. పాదాలకు మేకులు కొట్టారు. అక్కడితో ఆగకుండా చేతిని సూదితో గుచ్చారు. అలాగే మెడపై బూడిద జల్లారు. ఆపై ఆ మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. ఈ ఘటన బీహార్‌లోని నలందజిల్లాలో జరిగింది. అందులోనూ సీఎం నితీష్ కుమార్ జిల్లాలో జరగడంతో విపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడు ఇది యావత్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
కాళ్లకు 10 మేకులు
నలంద జిల్లాలోని చండి పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్‌లో కొందరు దుండగులు ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. హత్య తరువాత పాదాలకు 10 మేకులు కొట్టారు. ఆపై కుడిచేతిపై సూదితో పొడిచిన గుర్తులు కనిపించాయి. అదే సమయంలో ఆ యువతి మెడపై బూడిద చల్లారు. ఇక హత్య చేసిన తర్వాత ఆ యువతిని నడి రోడ్డు పక్కన వదిలేశారు. స్థానిక గ్రామస్తులు ఈ మృతదేహాన్ని చూసి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.
VIDEO | Bihar: Hilsa DSP Sumit Kumar on murder of a woman, whose body was found with nine nails hammered into her foot soles, says, "At about 9.30 am on March 5, the Chandi Police Station received an information about body of an unknown woman being recovered in Bahadurpur… pic.twitter.com/GE2crveqBF
— Press Trust of India (@PTI_News) March 6, 2025
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!
అయితే ఆమె ఎవరు? అనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమెది ఏ గ్రామం?.. ఆమెను ఇంతగా చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది?.. దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హత్యకు ముందు ఆ మహిళపై అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
महिला अत्याचार और उत्पीड़न में बिहार शीर्ष राज्यों में है। मुख्यमंत्री श्री नीतीश कुमार को शर्म है कि आती ही नहीं! उनके गृह जिला में घटित इस रूह कंपकंपाने वाले वीभत्स कांड और दरिंदगी से भी अगर किसी को कोई फर्क नहीं पड़ता तो वह इंसान है नहीं!
— Tejashwi Yadav (@yadavtejashwi) March 6, 2025
वैसे इस घटना को भी बेशर्म भाजपाई और… pic.twitter.com/JebH6v3hnL
ఈ ఘటనపై హిల్సా డిఎస్పీ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. బాధితురాలి వయస్సు 25- నుంచి -30 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. ఆమె పాదాలపై మేకులు కొట్టబడినాయని, ఆమె మెడపై బూడిద గుర్తులు ఉన్నాయని తెలిపారు. మృతదేహం కుడిచేతిపై సూదితో పొడిచిన గుర్తులు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు మృతదేహాన్ని గుర్తించలేదని.. సమాచారం జిల్లాకు, పొరుగు జిల్లాలకు పంపబడిందని తెలిపారు.