Maoists: సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ భార్య తారక్క మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. తారక్క అలియాస్ విమల సీదం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉండేవారు. ఆమెతో సహా మొత్తం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

New Update
Maoists Surrenders before CM Fadnavis

Maoists Surrenders before CM Fadnavis

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ భార్య తారక్క లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఆమె లొంగిపోయారు.  తారక్క అలియాస్ విమల సీదం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉండేవారు. ఆమె భర్త మల్లోజుల వేణుగోపాల్.. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీకి తారక్క సమీప బంధువు. తాజాగా ఆమె సీఎం ఎదుట లొంగిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు..!

1983లో తారక్క మావోయిస్టు దళంలో చేరారు. నాలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఆమెపై 170కి పైగా కేసులు నమోదయ్యాయి. ఆమెపై రూ.కోటికి పైగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే.   

Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

Also Read: Infosys: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!

Also Read: కొత్త సంవత్సరం మొదటి రోజే..తల్లి,నలుగురు చెల్లెళ్లను చంపేసిన కిరాతకుడు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు