/rtv/media/media_files/2025/03/31/JPOhNB37RX0Qo4fxFJ7n.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10% నుంచి 41% వరకు కొత్త సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ఏ దేశం అయితే అమెరికాపై ఎక్కువగా సుంకాలు విధిస్తుందో.. ఆ దేశానికి ట్రంప్ అధికంగా సుంకాలు విధించారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ ఈ సుంకాలను ప్రకటించారు. అమెరికాకు మిత్రదేశంగా ఉంటున్న భారత్‌పై కూడా 25 శాతం వరకు సుంకం విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ టారిఫ్‌లు కొన్ని దేశాలకు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. అయితే ట్రంప్ ప్రపంచ దేశాల్లో ఏయే దేశాలపై ఎంత సుంకం విధించారో చూద్దాం.
ఇది కూడా చూడండి:Trump: భారత్‌పై పగబట్టిన ట్రంప్ పాక్‌తో వ్యాపారం.. ఇండియా పై సెటైర్లు
కెనడాపై 35% సుంకం
ట్రంప్ విధించిన కొత్త సుంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే అమెరికా కెనడాపై 25 శాతంగా ఉన్న సుంకాన్ని 35 శాతానికి పెంచింది. కెనడా అక్రమ డ్రగ్స్ సంక్షోభంపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, ఈ కొత్త సుంకాలలో కొన్నింటిని వెంటనే అమల్లోకి తెచ్చారు. అలాగే అమెరికాపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ దేశాలపైనే ఎక్కువ
డొనాల్డ్ ట్రంప్ అత్యధికంగా సిరియా, లావోస్, మయన్మార్ దేశాలపై సుంకం విధించారు. సిరియాలో 41 శాతం, లావోస్, మయన్మార్‌లో 40 శాతం సుంకం, స్విట్జర్లాండ్‌లో 39 శాతం, ఇరాక్, సెర్బియాలో 35 శాతం వేశారు. అల్జీరియా, బోస్నియా మరియు హెర్జెగోవినా, లిబియా, దక్షిణాఫ్రికాలో 30 శాతం, భారత్, బ్రూనై, కజాఖ్స్తాన్, మోల్డోవా, ట్యునీషియాలో 25 శాతం, బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంలో 20 శాతం, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్‌లో 19 శాతం, నికరాగ్వాలో 18 శాతం, ఇజ్రాయెల్, జపాన్, టర్కీ, నైజీరియా, ఘనాలో 19 శాతం, బ్రెజిల్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫాక్లాండ్ దీవుల్లో 10 శాతం సుంకం విధించారు.
ఆగస్టు 7వ తేదీ
కొన్ని దేశాల టారిఫ్‌లు నేటి నుంచి అమల్లోకి రాగా, మరికొన్ని కొత్త దేశాలకు సుంకాలు ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. చైనాకి ఈ సుంకాలపై గడువు తేదీని ఆగస్టు 12వ తేదీ వరకు విధించారు. ఈ తేదీలోగా చైనా అంగీకారానికి రావాలి. లేకపోతే ఆ దేశంపై కూడా కొత్త సుంకాలు తప్పకుండా పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందా?
ట్రంప్ టారిఫ్‌లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సుంకాల వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి, వినియోగదారులపై భారం పడుతుంది. ఇది ప్రపంచ వాణిజ్య సరఫరాను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అల్యూమినియం, ఉక్కు, వెహికిల్స్ విడిభాగాలు, రొయ్యలు, రత్నాభరణాలు, జౌళి, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఆహార ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:Trump: భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఈ ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం