Prajwal Revanna : అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు బిగ్ షాక్

జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం కేసులో బెంగుళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు  ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇప్పటివరకు ఆయనపై నమోదైన మొత్తం నాలుగు అత్యాచార కేసుల్లో మొదటి కేసు కావడం గమనార్హం.

New Update
revanna

జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం కేసులో బెంగుళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు  ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇప్పటివరకు ఆయనపై నమోదైన మొత్తం నాలుగు అత్యాచార కేసుల్లో మొదటి కేసు కావడం గమనార్హం.  కేసు నమోదైన 14 నెలల తర్వాత తీర్పు వెలువడింది. కోర్టులో భావోద్వేగానికి గురైన రేవణ్ణ, తీర్పు వెలువడిన తర్వాత కోర్టు గది నుండి బయటకు వెళ్తూ ఏడుస్తూ కనిపించాడు.  రేవణ్ణ కుటుంబం వద్ద పని చేసిన 47 ఏళ్ల మహిళపై 2021లో రెండుసార్లు అత్యాచారం చేశారని ఫిర్యాదులో ఆరోపించింది. ఒకసారి హసన్‌లోని ఫామ్‌హౌస్‌లో, మరోసారి బెంగుళూరులోని తన ఇంట్లో ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.  అంతేకాకుండా ఈ చర్యను ఆయన తన మొబైల్‌లో రికార్డ్ చేశాడని బాధితురాలు ఆరోపించింది.   అయితే ఈ కేసులో రేవణ్ణను దోషిగా నిర్ధారించిన కోర్టు, శిక్షను ఆగస్టు 2న ప్రకటించనుంది.  

Also Read :  100 రోజులు..12 మంది ఉగ్రవాదులు..కశ్మీర్ లో కొనసాగుతున్న వేట

పెండింగ్‌లో ఇంకా మూడు కేసులు

ప్రజ్వల్ రేవణ్ణపై ఇంకా మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. సిట ఇప్పటికే ఆయనపై అనేక ఛార్జిషీట్లు దాఖలు చేసింది. కొన్ని ఛార్జిషీట్లలో బాధితుల వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఉన్నాయి. అశ్లీల వీడియోలు వాస్తవమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు ధృవీకరించాయి. ఈ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆయన పలువురు మహిళలను లైంగికంగా వేధించారని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా బెయిల్ కోసం ప్రజ్వల్ చేసిన అభ్యర్థనలను సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టులు తిరస్కరించాయి. అయితే ఈ కేసులో ప్రజ్వల్ తో పాటుగా అతని తండ్రి, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ, తల్లి భవానీ రేవణ్ణలపై కూడా కిడ్నాప్ ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వారు కూడా అరెస్టు అయ్యారు. ప్రజ్వల్ సోదరుడు, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి.

Also Read :  ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఆ రోజే పోలింగ్

ప్రజ్వల్ రేవణ్ణ పొలిటికల్ కెరీర్

మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు మనవడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ కుమారుడిగా ప్రజ్వల్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో ఆయననుజనతాదళ్ (సెక్యులర్) (JD(S))  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో భారత్ లో  అత్యంత పిన్న వయస్కులైన పార్లమెంటు సభ్యులలో ఆయన ఒకరు. 2024 లోక్ సభ ఎన్నికల ముందు ఆయన రాజకీయ జీవితం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 

telugu-news | jds | karnataka | prajwal-revanna | latest-telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు