Vitamin Deficiency: మీకు బాగా నిద్ర వస్తుందా..? అయితే మీకు ఆ లోపం ఉన్నట్లే.. షాకింగ్ విషయాలు!

నిద్ర చక్రంను నియంత్రించడంలో విటమిన్ D, విటమిన్ B12, మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ సమతుల్యత దెబ్బతీస్తుంది. దీంతో ఆలస్యంగా నిద్ర పట్టడం, రాత్రికి రాత్రి నిద్ర మధ్యలో మేల్కోవడం వంటి సమస్యలు వస్తాయి.

New Update
Vitamin Deficiency

Vitamin Deficiency

నిద్ర అనేది మన ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగం. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం, మెదడు విశ్రాంతి తీసుకుంటాయి. ఇది మరుసటి రోజు ఉత్తమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. నిద్ర మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. నిద్రలేమి వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై చెడు ప్రభావం పడవచ్చు. అందుకే ప్రతి రోజు తగినంత నిద్రపోవడం చాలా అవసరమని చెబుతారు. మంచి నిద్ర కోసం ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. దీనికి ప్రధాన కారణం కేవలం ఒత్తిడి, అలసట మాత్రమే కాదని. శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల లోపం కూడా దీనికి కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై కొందరు నిపుణులు మాట్లాడుతూ.. మంచి నిద్రకు కేవలం సౌకర్యవంతమైన పడక మాత్రమే కాదని.. సరైన పోషకాహారం కూడా అవసరమని తెలిపారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

నిద్ర లోపాన్ని తగ్గించే విటమిన్లు..

విటమిన్ D: నిద్ర చక్రంను నియంత్రించడంలో విటమిన్ D ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల శరీరంలో అలసట, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా సూర్యరశ్మికి దూరంగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

విటమిన్ B12: ఇది మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరం. విటమిన్ B12 లోపం వల్ల నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్ల ఆలస్యంగా నిద్ర పట్టడం లేదా రాత్రికి రాత్రి నిద్ర మధ్యలో మేల్కోవడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు

మెగ్నీషియం: ఇది విటమిన్ కాకపోయినా.. నిద్రతో దీనికి లోతైన సంబంధం ఉంది. మెగ్నీషియం మెదడును శాంతపరచడంలో, కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. దీని లోపం నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ పొడి వేస్తే పులిహోర రుచి అదిరిపోతుంది

రోజుకు 20 నిమిషాలు ఎండలో ఉండటం, పాలు, గుడ్లు, పుట్టగొడుగులు తినడం వల్ల ఈ విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ B12.. పెరుగు, పాలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు తీసుకోవాలి. మెగ్నీషియం. బాదం, అక్రోట్, అరటిపండ్లు, ఆకుకూరలు, పప్పులు ఆహారంలో చేర్చుకోవాలి. నిద్ర సమస్యలు తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించి సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది. మంచి నిద్ర కోసం నిద్రపోయే ముందు మొబైల్, ల్యాప్‌టాప్‌లు వాడటం తగ్గించడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటివి కూడా పాటించాలి. నిరంతరంగా నిద్ర సమస్యలు ఉంటే కేవలం ఒత్తిడి అనుకోకుండా, విటమిన్ల లోపాన్ని గుర్తించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఏసీ గదుల్లో పడుకుంటే పీడకలలు నిజంగానే వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Advertisment
తాజా కథనాలు