Vitamin D: ఎముకలతోపాటు ఆరోగ్యానికి విటమిన్ D లోపం పరార్.. ఆశ్చర్యకరమైన లాభాలను తెలుసుకోండి!!

విటమిన్‌-D కేవలం ఎముకలను బలోపేతం చేయడంతోపాటు శరీరంలోని ఇతర కీలక విధులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ లోపాన్ని వెంటనే ఎలా తీర్చి.. విటమిన్‌-D ఎలా పెంచుకోవాలో తెలుసుకోలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Vitamin D

Vitamin D

ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి విటమిన్లు, ఖనిజాలు అత్యవసరం. వీటిలో ముఖ్యమైనది సూర్యరశ్మి విటమిన్ అని పిలువబడే విటమిన్ D. ఈ విటమిన్ కేవలం ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా.. శరీరంలోని ఇతర కీలక విధులకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ D గురించి చాలా మందికి తెలియని ఐదు ఆసక్తికరమైన విషయాలను డాక్టర్లు తెలుపుతున్నారు. విటమిన్ D రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. గుండె, మెదడు, మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ లోపాన్ని వెంటనే తీర్చే కొన్ని విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

ఆరోగ్యానికి విటమిన్ D.. 

విటమిన్‌తోపాటు హార్మోన్: విటమిన్ D కేవలం విటమిన్ మాత్రమే కాదు. ఇది శరీరానికి ఒక రకమైన హార్మోన్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది 200 కంటే ఎక్కువ జన్యువులను నియంత్రిస్తూ.. అనేక ముఖ్యమైన శరీర విధులను ప్రభావితం చేస్తుంది.

ఆహారంలో తక్కువ: సాల్మన్, ట్యూనా చేపలు, గుడ్లు లేదా పుట్టగొడుగులు వంటి ఆహారాలలో విటమిన్ D లభించినప్పటికీ.. 15 నిమిషాల సూర్యరశ్మి ద్వారా చర్మం తయారు చేసేంత విటమిన్ D వాటిలో ఉండదని వైద్యులు తెలుపుతున్నారు.

లోపం: విటమిన్ D లోపం లక్షణాలు అలసట, చిరాకు, తరచుగా అనారోగ్యానికి గురికావడం స్పష్టంగా కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు ఇది సంవత్సరాల తరబడి గుర్తించబడకుండా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: ఈ 5 ఫుడ్ ఐటెమ్స్ కుక్కర్‌లో ఉడికిస్తే డేంజర్.. విషంతో సమానం.. లిస్ట్ ఇదే!

అతిగా వాడకూడదు: విటమిన్ D సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం హానికరం. ముఖ్యంగా ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. చాలా మంది పెద్దలకు రోజుకు 600-800 IU అవసరం. అందుకే.. సప్లిమెంట్లను తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

సూర్యరశ్మి: మధ్యాహ్నం 10-30 నిమిషాల పాటు సూర్యరశ్మికి గురికావడం ద్వారా సహజంగా 1,000-2,000 IU విటమిన్ D పొందవచ్చు. విటమిన్ Dకి సూర్యరశ్మి కంటే మెరుగైన వనరు మరొకటి లేదు. మంచి ఆరోగ్యం కోసం సూర్యరశ్మిని తప్పక ఉపయోగించుకోవాలని, సప్లిమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: బ్లాక్ కాఫీతో కాలేయానికి రక్షణ.. సిర్రోసిస్, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందంటున్న నిపుణులు!!

Advertisment
తాజా కథనాలు