/rtv/media/media_files/2025/10/09/liver-2025-10-09-12-08-11.jpg)
liver and Black coffee
రోజువారీ జీవితంలో అలసట నుంచి ఉపశమనం పొందడానికి కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే సరైన పద్ధతిలో కాఫీ తాగితే కాలేయ వ్యాధులైన సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని, బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీలో కెఫీన్, క్లోరోజెనిక్ యాసిడ్ (CGA), ట్రిగోనెల్లిన్, డైటెర్పీన్స్ వంటి అనేక ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే సరైన కాఫీని ఎంచుకోవడం ముఖ్యం. పాలు, చక్కెర కలిపిన కాఫీ కాకుండా.. బ్లాక్ కాఫీ మాత్రమే నిజమైన ఔషధంగా పనిచేస్తుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. కాలేయం నుంచి కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడే కాఫీ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీతో కాలేయానికి రక్షణ:
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. చక్కెర, పాలు లేని బ్లాక్ కాఫీ కాలేయానికి ఒక అద్భుతమైన ఔషధం. ఇది కాలేయంలోని కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో (Fat Deposits) సహాయపడి.. దీర్ఘకాలిక నష్టాన్ని నివారిస్తుంది. ఇది కాలేయం నుంచి కొవ్వును కరిగించగల ఏకైక సహజ పదార్థాలలో ఒకటిగా నిపణులు చెబుతున్నారు. అయితే రోజుకు 2 నుంచి 4 కప్పుల కాఫీ తాగే వ్యక్తులలో కాలేయ వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉందని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. ముఖ్యంగా హెపటోసెల్యులర్ కార్సినోమా (HCC), లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పును కాఫీ తగ్గిస్తుందని నివేదిక పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: చిన్నారుల్లో జలుబు, దగ్గుకు చెక్ పెట్టే అద్భుతమైన ఇంటి చిట్కాలు !!
రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల బ్లాక్ కాఫీ తాగడం ద్వారా కాలేయంలోని కొవ్వు మొత్తం కరిగిపోయి.. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది జీవక్రియను పెంచి (Metabolism), శరీరంలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నియంత్రిస్తుంది. మరో అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగడం గుండె ఆరోగ్యానికి సురక్షితమని, గుండె సంబంధిత సమస్యలు, వాటి వల్ల కలిగే మరణాల ప్రమాదం కూడా తగ్గుతుందని ఆ నివేదిక వెల్లడించింది. అయితే కేవలం కాఫీ తాగడం ద్వారా కాలేయ వ్యాధులను పూర్తిగా నివారించలేమని.. మద్యం సేవించడం మానేసి, ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలిని పాటించడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి..? 20, 21 తేదీల్లో ఏది కరెక్టో తెలుసా..?