Varalakshmi Vratham 2025: వరలక్ష్మి వ్రతం.. ఇలా ముత్తైదువుకు వాయినం ఇవ్వండి.. ఇక మీకు తిరుగుండదు!

వరలక్ష్మీ వ్రతం తర్వాత వాయినం అనేది ఒక పవిత్ర సంప్రదాయం. వాయినంలో పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు పెట్టాలి. ఈ వస్తువులన్నీ ఇస్తే సకల శుభాలు కలుగుతాయి.

New Update
Varalakshmi Vratham 2025

Varalakshmi Vratham 2025

శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికతకు, పండుగలకు నెలవు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు స్త్రీలు తమ కుటుంబ సౌభాగ్యం, సుఖ సంతోషాల కోసం వరలక్ష్మీ వ్రతాన్ని(Varalakshmi Vratham 2025) అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8 శుక్రవారం ఘటనంగా చేసుకుంటున్నారు. మహిళలందరూ ఈ పవిత్రమైన రోజు కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ వ్రతం రోజున వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను ఆరాధించినంత ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రత విధానం.. దాని మహిమను సాక్షాత్తు శివుడే తన సతీమణి పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కంద పురాణం పేర్కొంది. అయితే ఈ వ్రతంలో ముత్తైదువుకు వాయినంగా ఏం ఇవ్వాలో  కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

సిరిసంపదలను అందించే వరలక్ష్మి వ్రతం..

శ్రావణ మాసం(Sravana Masam 2025) శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి రోజు చంద్రుడు కలిసే నెల. అటువంటి పవిత్రమైన మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు విశేషమైన ఫలితాలు లభిస్తాయని ప్రగాఢ నమ్మకం. వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి కావాల్సిన పూజా సామాగ్రి, వ్రత విధానం గురించి ముందుగానే తెలుసుకోవడం వలన పండుగ రోజున ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజను పూర్తి చేయవచ్చు. ఈ పూజలో అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం, సిరిసంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించడం ప్రధానం. ఈ పవిత్రమైన రోజున తమ ఇంటిని శుభ్రం చేసి, లక్ష్మీదేవిని కలశ రూపంలో ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ వ్రత కథను చదవడం, తోటి ముత్తైదువులను గౌరవించడం కూడా ఈ పూజలో భాగం. 

ఇది కూడా చదవండి: వామ్మో.. భక్తి మాత్రమే కాదు.. వరలక్ష్మి పూజ వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా !

వరలక్ష్మీ వ్రతం తర్వాత వాయినం అనేది ఒక పవిత్ర సంప్రదాయం. వరలక్ష్మీ వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయినం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పండితుల అభిప్రాయం ప్రకారం.. వాయినంలో పెట్టే ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ వస్తువులన్నీ శుభానికి, సౌభాగ్యానికి ప్రతీకలు. ఈ వాయనం ఇవ్వడం వల్ల ఆశీస్సులు, సకల శుభాలు కలుగుతాయి. ఈ ఆచారం మన సంస్కృతిలో భాగమై ఎన్నో తరాలుగా కొనసాగుతోంది. ఈ వరలక్ష్మీ వ్రతం ద్వారా ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యంతో సుఖంగా ఉండాలని కోరుకుందాం.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చదవండి:  ఈ సమయంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్రతం అసలు చేయకూడదు.. పొరపాటున చేశారో కటిక పేదరికం తప్పదు!

Advertisment
తాజా కథనాలు