Varalakshmi Vratham 2025: ఈ సమయంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్రతం అసలు చేయకూడదు.. పొరపాటున చేశారో కటిక పేదరికం తప్పదు!

వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం రోజు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల మధ్యలో అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పూజ చేయడం వల్ల కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతీ విషయంలో ఆటంకం ఏర్పడతాయని చెబుతున్నారు.

author-image
By Kusuma
New Update
Varalakshmi Vratham

Varalakshmi Vratham

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి(Sravana Masam 2025) ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో మహిళలు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. కోరిన కోరికలు అన్ని నెరవేరడంతో పాటు మంచి భర్త వస్తారని బలంగా నమ్ముతారు. పెళ్లి కాని మహిళలు మంచి భర్త కోసం, పెళ్లి అయిన మహిళలు భర్త ఆయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని భావిస్తారు. ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల కంటే చివరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ శుక్రవారం పూజలు చేయడానికి కుదరని వారు ముందు వారాల్లో చేస్తారు. కానీ ఎక్కువ మంది ఈ శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. అయితే కొందరికి తెలియక ఏదో ఒక సమయంలో ఈ వరలక్ష్మీ వ్రతం చేస్తారు. దీనివల్ల ఇంట్లో సమస్యలు, కటిక పేదరికం వంటి సమస్యలను అనుభవిస్తారని పండితులు అంటున్నారు. అయితే వరలక్ష్మీ వ్రతం ఏ సమయంలో చేయాలి? ఏ సమయంలో అసలు చేయకూడదు? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Raksha Bandhan 2025: సోదరుడికి రాఖీ కడుతున్నారా.. ఒక్క నిమిషం.. ఏ రంగు రాఖీ కడితే మంచిదో తెలుసా?

ఈ సమయంలో అసలు చేయకూడదు..

మహిళలు ఎంతో భక్తితో పూజిస్తే వరలక్ష్మీ వ్రతాన్ని(varalakshmi-vratham) రేపే జరుపుకోనున్నారు. అయితే వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 8వ తేదీయ అనగా శుక్రవారం నాడు ఉదయం 6.54 గంటల నుంచి 9.02 గంటల సమయంలో జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో కుదరని వారు మధ్యాహ్నం 1.19 గంటల నుంచి 3.33 గంటల వరకు లేదా సాయంత్రం 7.29 గంటల నుంచి రాత్రి 9.06 గంటల సమయంలో అయినా చేసుకోవచ్చు. కానీ ఈ పూజను చాలా మంది ఎక్కువగా ఉదయం పూట మాత్రమే చేస్తారు. వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని కొత్త దుస్తులు ధరించి, ఎన్నో రకాల వంటలు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడతారు. అయితే కొందరికి తెలియక అశుభ సమయంలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. దీనివల్ల పూజ చేసిన ఫలితం ఉండదని అంటున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల మధ్యలో అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పూజ చేయడం వల్ల కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతీ విషయంలో సమస్యలు వస్తాయి. అనుకున్న పని ఒక్కటి కూడా జరగదు. ముఖ్యంగా పూజ చేసిన ఫలితం ఒక శాతం కూడా రాదని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:Raksha Bandhan 2025: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్లు వేయాలి? 1 లేదా 2 అనేది తెలియకుండా రాఖీ కడితే అంతే సంగతులు

ఉపవాసం ఆచరించి..

ఎంతో నిష్టతో ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యపానం వంటివి తీసుకోకూడదని అంటున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అదే సాధారణ మనుషులు ఉపవాసం ఆచరించాలని చెబుతున్నారు. ఈ సమయంలో పాలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. అలాగే బ్రహ్మాచర్యం పాటించాలి. ఈ నియమాలు పాటించి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు జరగడంతో పాటు అన్ని విధాలుగా కుటుంబం సంతోషంగా ఉంటుందని పండితులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు సంబంధిత పండితులను సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు