/rtv/media/media_files/2025/08/07/varalakshmi-vratham-2025-08-07-13-56-42.webp)
Varalakshmi Vratham
హిందూ సంప్రదాయాలలో వరలక్ష్మీ వ్రతానికి(Varalakshmi Vratham 2025) విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది శ్రావణ మాసం(Sravana Masam 2025) లోని రెండవ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం చేసే వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం చాలా ముఖ్యమైనది, విశిష్టమైనది! సిరిసంపదలతో పాటు మహిళలు తమ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పెళ్లికాని అమ్మయిలు మంచి భర్త రావాలని, పెళ్ళైన వారు దీర్ఘ సుమంగళిగా ఉండాలని వరలక్ష్మీ దేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ధనం, ధాన్యం, కీర్తి, ఆరోగ్యం, సంతానం, విజయం, సుఖం, జ్ఞానం వంటి ఎనిమిది రకాల సంపదలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుందని నమ్మకం. అంతేకాదు ఈ వ్రతం ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి, ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి. అయితే వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మీ పూజతో ఆరోగ్యం కూడా..
కుంకుమ ప్రాముఖ్యత
పూజ చేసేటప్పుడు నుదురు మధ్యలో కుంకుమ పెట్టుకోవడం వల్ల శరీరంలో 'ఆజ్ఞా చక్రం' ఉత్తేజితం అవుతుంది. దీనివల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు, కుంకుమ తయారు చేయడానికి వాడే సున్నం శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తుందని చెబుతారు.
పసుపు ప్రాముఖ్యత
పూజలో మొదటగా పసుపుతో గౌరీదేవిని చేసి పూజిస్తాం! ఇది కేవలం శుభసూచకం మాత్రమే కాదు దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అయితే పసుపు క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఈ పసుపును వ్రతం చేసేటప్పుడు కాళ్లకు, చేతులకు పూయడం ద్వారా ఏదైనా బాక్టీరియా ఉంటె చనిపోతుంది. అంతేకాదు పురాతన కాలంలో ఏదైనా గాయమైతే ఇన్ ఫెక్షన్ రాకుండా పసుపును వాడేవారు. అలాగే దీనిలోని కుర్కుమిన్ అనే రసాయనం చర్మ సౌందర్యానికి సహాయపడుతుంది.
దీపం వెలిగించడం..
దీపంలోని నూనె, ఆ ఒత్తి నుంచి వెలువడే కాంతి, వాతావరణంలోని కీటకాలను దూరం చేస్తాయి. దీనివల్ల చుట్టూ ఉన్న గాలి శుద్ధి అవుతుంది. అంతేకాదు, దీపం వెలుగు మనకు సానుకూల శక్తిని అందిస్తుంది
పువ్వులు, పండ్లు దీపం
వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు పూజ కోసం అనేక రకాల పువ్వులు, పండ్లు ఉపయోగిస్తాం. గులాబీ, మల్లె, తామర వంటి పువ్వుల సువాసన కలిగి మనసును ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుతాయి. ఇక పూజ తర్వాత నైవేద్యం కోసం పెట్టిన పండ్లను ప్రసాదంగా స్వీకరించడం ద్వారా శరీరానికి పోషకాలు అందుతాయి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. .
కొబ్బరికాయ, తాంబూలం
కొబ్బరికాయలోని నీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది స్వచ్ఛతకు, నూతనత్వానికి ప్రతీక. ఇక తాంబూలంలోని తమల పాకు, వక్క కూడా అనేక ఔషధాలను కలిగి ఉంటుంది. తమలపాకులో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Also Read: Raksha Bandhan 2025: రాఖీ కట్టేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయరాదు! బంధానికే ముప్పు