/rtv/media/media_files/2025/09/14/sleeping-using-mobile-2025-09-14-20-07-15.jpg)
sleeping using mobile
నేటి తరం యువతలో అత్యధిక శాతం మందికి ఉదయం నిద్ర లేవగానే అలారం మోగడంతోనే రోజు ప్రారంభమవుతుంది. వెంటనే చేతిలోకి మొబైల్ ఫోన్ తీసుకుంటారు. మొదట నోటిఫికేషన్లు, ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను చూస్తూ గంటల తరబడి సమయాన్ని గడిపేస్తున్నారు. స్నేహితుల కొత్త పోస్టులు, వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లు, ఆ తర్వాత ఈమెయిల్స్ లేదా ఆఫీస్ సందేశాలను చూడటం దైనందిన అలవాటుగా మారిపోయింది. పడకపై నుంచి లేవకుండానే గంటల తరబడి ఈ విధంగా మొబైల్ వాడటం సర్వసాధారణమైపోయింది. ఈ అలవాటు మన మెదడు, శరీరం, మానసిక స్థితిపై ఎంతగానో ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఫోన్ వాడితే ప్రాణాంతకమే..
మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి (Blue light) కళ్ళకు విషంతో సమానం. ఉదయం నిద్ర లేవగానే దీన్ని చూడటం వల్ల కళ్ళలో మంట, పొడిబారడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. పడుకొని మొబైల్ వాడటం వల్ల శరీర భంగిమ (posture) చెదిరిపోతుంది. ఇది మెడ, వీపు నొప్పులకు దారితీస్తుంది. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే వెన్నెముక సమస్యలు (Spinal problems) కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఉదయం లేవగానే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇతరుల పోస్టులు, భయానక వార్తల హెడ్‌లైన్స్, ఆఫీస్ నుంచి వచ్చే ఒత్తిడితో కూడిన ఈమెయిల్స్ వంటివి కనిపిస్తాయి. దీనివల్ల మీ మెదడు అశాంతికి గురవుతుంది. రోజంతా ఆందోళనతోనే ప్రారంభమవుతుంది. నిద్రలేవగానే మెరిసే స్క్రీన్, వేల కొద్దీ నోటిఫికేషన్స్‌తో మెదడు వేడెక్కుతుంది. దీనివల్ల ఎలాంటి వార్మప్ లేకుండానే ఒత్తిడి, ఆందోళన, అలసటతో రోజు మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: నిద్రలో బాగా చెమటలు పడుతున్నాయా..? అయితే మీ ఆరోగ్యానికి ప్రమాద ఘంటికలు మోగినట్లే
అయితే ఉదయం మన మెదడు శుభ్రమైన స్లేటులా ఉంటుంది. ఈ సమయాన్ని సానుకూల ఆలోచనలతో, మంచి విషయాలతో నింపుకోవాలి. కానీ నిద్రలేవగానే స్క్రీన్‌పై వచ్చే సమాచారంతో మెదడు అలసిపోతుంది. దీంతో ఏకాగ్రత (concentration) తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కష్టాలు ఎదురవుతాయి. రోజంతా చిరాకుగా, నిరుత్సాహంగా ఉండటానికి ఇది ఒక కారణం. మొబైల్ ఫోన్ వాడకం వల్ల దృష్టి సారించే సామర్థ్యం తగ్గుతుంది. ఉదయం లేవగానే స్క్రీన్ చూడటం వల్ల మెదడు అలసిపోయి రోజంతా పనిమీద దృష్టి పెట్టలేరు. దీనివల్ల పనిలో తప్పులు, చదువుపై ఆసక్తి తగ్గడం, అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఉదయం నిద్రలేవగానే మొబైల్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. నివారణకు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:గుడ్లు ఇలా ఉడికిస్తే క్యాన్సర్ గ్యారంటీ!!