/rtv/media/media_files/2025/09/14/egg-cooking-2025-09-14-19-23-52.jpg)
Egg Cooking
గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, కోలిన్ మరియు కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ఉడికించే విధానం వల్ల ఆరోగ్యానికి ముప్పు కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద (176°C లేదా 350°F కంటే ఎక్కువ) గుడ్లను ఎక్కువసేపు ఉడికించినప్పుడు.. వాటిలోని కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అయ్యి'ఆక్సిస్టెరాల్స్ అనే హానికరమైన పదార్థాలు ఏర్పడతాయి. ఈ ఆక్సిస్టెరాల్స్ శరీరంలో మంట (inflammation)ను పెంచుతాయి. ధమనుల్లో ప్లాక్ పేరుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అధిక వేడితో గుడ్లను ఉడికించడం ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉందో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఆరోగ్యానికి ప్రమాదకరం..
ఓ అధ్యయనం ప్రకారం.. ఆక్సిస్టెరాల్స్ చెడు కొలెస్ట్రాల్‌తో కలిసి ధమనుల్లో ప్లాక్‌ని ఏర్పరుస్తాయి. దీంతో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అధిక ఆక్సిస్టెరాల్స్ రొమ్ము, ప్రోస్టేట్, కోలన్ క్యాన్సర్ల ప్రమాదాన్ని 22% వరకు పెంచుతాయి. ఆక్సిస్టెరాల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కూడా పెంచుతాయి. దీనివల్ల శరీరంలోని కణాలు, కణజాలాలు దెబ్బతింటాయి. తద్వారా క్యాన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గుండె, క్యాన్సర్లకే పరిమితం కాదు. ఇది కంటి చూపు, జ్ఞాపకశక్తిని కూడా బలహీనపరుస్తుంది. వయసు పెరిగే కొద్దీ మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇది కూడా చదవండి: అక్కడ మొటిమలు వస్తే ఇక అంతే సంగతులు
ఆహార నిపుణల సూచనల ప్రకారం... గుడ్లను తక్కువ వేడిపై ఉడికించడం సురక్షితం. స్క్రాంబుల్డ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్ తయారు చేయడం ఉత్తమం. వీటిలో కూరగాయలు కలపడం వల్ల ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. గుడ్లను ఉడికించడానికి అవోకాడో నూనె మంచిది. ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక వేడిపై ఎక్కువసేపు వేయించిన ఓవర్ హార్డ్ గుడ్లలో ఆక్సిస్టెరాల్స్ ఎక్కువగా ఏర్పడతాయి. వీటిని 5 నిమిషాల కంటే ఎక్కువసేపు వేయించడం ప్రమాదకరం. ప్రాసెస్డ్ మాంసం కూడా అధిక వేడిపై ఉడికించినప్పుడు ఇలాంటి ప్రమాదాన్నే కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. నివారణకు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నిద్రలో బాగా చెమటలు పడుతున్నాయా..? అయితే మీ ఆరోగ్యానికి ప్రమాద ఘంటికలు మోగినట్లే