Sweating: నిద్రలో బాగా చెమటలు పడుతున్నాయా..? అయితే మీ ఆరోగ్యానికి ప్రమాద ఘంటికలు మోగినట్లే

నిద్రలో చెమట పట్టడం అనేది కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ సమస్య ఎక్కువగా ఉంటే హైపర్‌ థైరాయిడిజమ్, ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత, ప్రోస్టేట్ క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
sweating while sleeping

sweating while sleeping

రాత్రిపూట చెమట పట్టడం అనేది చాలామందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. కానీ ఇది తరచుగా జరుగుతూ ఉంటే.. దాన్ని తేలిగ్గా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం... నిద్రలో చెమట పట్టడం అనేది కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యకు సరైన కారణం తెలుసుకోవడం.. సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మీరు నిద్రపోతున్నప్పుడు అధికంగా చెమట పడుతుంటే.. వచ్చే ప్రమాదకరమైన వ్యాధులను తగ్గించే చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

వ్యాధులకు సంకేతం..

హైపర్‌ థైరాయిడిజమ్: థైరాయిడ్ గ్రంథి అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు.. శరీరం వేడి, చెమటను తట్టుకోలేకపోతుంది. ఈ పరిస్థితిని హైపర్‌థైరాయిడిజమ్ అంటారు.

ఒత్తిడి, ఆందోళన: అధిక మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా రాత్రివేళ చెమట పట్టడానికి ప్రధాన కారణాలు. ఈ సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన కలగడం సాధారణం.

డయాబెటిస్: శరీరంలోని చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గితే.. డయాబెటిస్ రోగులకు రాత్రిపూట చెమట పడుతుంది.

ఇది కూడా చదవండి: థైరాయిడ్ బాధపడుతున్నారా..? అయితే ఇవి మాత్రం అస్సలు తినకండి..!!

హార్మోన్ల అసమతుల్యత: మహిళల్లో మెనోపాజ్ లేదా హార్మోన్ల మార్పుల వల్ల కూడా రాత్రివేళ చెమట పట్టవచ్చు. ఈ సమయంలో అశాంతి, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి.

ప్రోస్టేట్ క్యాన్సర్: పురుషులలో ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌కు లక్షణం కావచ్చు. ముఖ్యంగా చికిత్సలో భాగంగా తీసుకునే మందుల కారణంగా రాత్రిపూట అధికంగా చెమట పడుతుంది.

గుండె జబ్బులు: గుండె జబ్బులు, గుండెపోటు రాకముందు కూడా శరీరం తరచుగా చెమటను విడుదల చేయవచ్చు. అందువల్ల ఇలాంటి పరిస్థితిలో తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ఊబకాయం: అధిక బరువు ఉన్నవారికి రాత్రిపూట చెమట సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. రాత్రిపూట తరచుగా చెమట పడుతూ అది నిద్రకు భంగం కలిగించినా లేదా బరువు తగ్గడం, అలసట, ఆందోళన వంటి లక్షణాలు కూడా ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీనితోపాటు చల్లని గదిలో నిద్రపోవడం, తేలికపాటి దుప్పట్లు వాడటం, నిద్రపోయేటప్పుడు ఎక్కువ బట్టలు ధరించకపోవడం మంచిది. కేవలం నూలు, లినెన్ బట్టలు మాత్రమే ధరించాలి. కారం, కెఫీన్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. నివారణకు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అక్కడ మొటిమలు వస్తే ఇక అంతే సంగతులు

Advertisment
తాజా కథనాలు