Fish Venkat: ఆ ఒక్క అలవాటే ఫిష్ వెంకట్ కొంప ముంచింది.. షాకింగ్ నిజాలు చెప్పిన క్లోజ్ ఫ్రెండ్!

ఫిష్‌ వెంకట్‌ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్లే అనారోగ్యానికి గురయ్యాడని వద్దు రా మామ ఆలా చేయకు అని చెప్పినా వినే వాడు కాదని వెంకట్‌ స్నేహితుడు,యాక్టర్ ఆనంద్ వెల్లడించాడు. ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు తెలిపారు.

New Update
Fish Venkat friend anand

Fish Venkat friend anand

ఫిష్‌ వెంకట్‌ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్లే అనారోగ్యానికి గురయ్యాడని వద్దు రా మామ ఆలా చేయకు అని చెప్పినా వినే వాడు కాదని వెంకట్‌ స్నేహితుడు,యాక్టర్ ఆనంద్ వెల్లడించాడు. ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు తెలిపారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: శంషాబాద్ లో హైటెన్షన్.. ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Fish Venkat Habbits

ఎదుటివారు ఎంత చెప్పిన వినే మూడ్‌లో లేకపోతే చెప్పలేం అని ఆయన అభిప్రాయపడ్డారు. మరీ టూ మచ్‌ చేయకురా మామ అంటే వినేవాడు కాదని, ఏమి కాదురా బై, ఏమైతది అని చెప్పేవాడని తెలిపారు. వరుస సినిమాలతో సినిమా ఇండస్ట్రీలో ఫిష్‌ వెంకట్‌కు మంచి గుర్తింపు వచ్చిందని, కందిరీగ సినిమా తర్వాత వెంకట్‌ చాలా బిజీ అయ్యాడన్నారు. రోజుకు రెండు మూడు సినిమాలు చేసే స్థాయికి వెళ్లాడు. మంచి పేరు వచ్చింది.  

ఇది కూడా చూడండి:Dowry Harassment : తొడలు,చేతులపై సూసైడ్ నోట్.. వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలి!

సక్సెస్‌తో డబ్బులు కూడా పెరిగాయి. పరిచయాలు పెరిగాయి. టైం దొరికిందంటే బండి తీసుకుని వైజాగ్‌, విజయనగరం, కొత్తగూడెం అని వెళ్లేవాడు. అక్కడికి వెళ్లాడంటే మూడు నాలుగు రోజులు ఉన్నాడంటే ఖాళీ లేదిక, టోటల్‌ డ్రింకింగే అని వివరించాడు ఆనంద్‌. దానికి టోటల్‌ గా బానిసయ్యాడు. ఒక రేంజ్‌ రాగానే టోటల్‌గా హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. షూగర్‌ అటాక్‌ అయింది. శరీరం సహకరించలేని పరిస్థితికి చేరుకుంది. ఇప్పుడు ఒక కిడ్నీ పెట్టాలి. దానికి ఆయన శరీరం సహకరిస్తదా లేదా తెలియదు. డోనర్స్‌ దొరకాలి. ఎవరిస్తారో తెలియదు అన్నారు. కిడ్నీ కావాలంటే చాలా ఖర్చు అవుతుంది. అన్నారు. ఫిష్‌ వెంకట్‌కు పెద్ద సర్కిల్‌ ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఎవరూ సాయం చేయకపోవడం బాధించిందని ఆనంద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు 2 రోజులు సెలవులు!

Also Read :  'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'

fish venkat family | fish venkat death news | Actor Fish Venkat Health Condition | Actor Fish Venkat Health | comedian fish venkat

Advertisment
Advertisment
తాజా కథనాలు