Salt: ఉప్పుతో గర్భనిర్థారణ చేసుకోవచ్చా..ఎలాగో తెలుసా?

గర్భధారణ స్థిరంగా ఉన్నదా, ఎలా కొనసాగుతోంది అనే విషయాలు క్లియర్‌గా తెలుకునే పద్ధతుల్లో ఉప్పుతో గర్భ పరీక్ష ఒకటి. ఈ పరీక్షలో ఉదయం తీసుకున్న మొదటి మూత్రంలో కొంత ఉప్పు కలిపి కొద్ది సేపు వేచి చూస్తారు. పాలలాంటి స్థిరత్వం కనిపిస్తే గర్భం ఉందని భావించేవారు.

New Update

Salt: రుతుచక్రం ఆలస్యం కావడం వల్ల గర్భధారణ గురించి అనుమానం కలిగినప్పుడు చాలామంది మహిళలు ముందుగా ఇంట్లో గర్భ పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆధునికంగా అందుబాటులో ఉన్న గర్భధారణ పరీక్ష కిట్లు ఉపయోగించి మూత్రం ద్వారా గర్భధారణను గుర్తించడం సాధ్యమవుతుంది. ఇవి శరీరంలో HCG అనే హార్మోన్‌ను గుర్తించి ఫలితాన్ని చూపిస్తాయి. ఈ కిట్లు సులభంగా ఉపయోగించదగినవిగా ఉండటంతో పాటు ఫార్మసీలలో తక్కువ ధరలకు లభిస్తాయి. అయితే ఈ టెస్ట్‌ల తరువాత నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.

పాలలాంటి స్థిరత్వం కనిపిస్తే..

ఎందుకంటే రక్త పరీక్షల ద్వారా గర్భధారణ స్థిరంగా ఉన్నదా, ఎలా కొనసాగుతోంది అనే విషయాలు క్లియర్‌గా తెలుస్తాయి. గతంలో ఈ రకమైన సౌకర్యాలు లేని సమయంలో ప్రజలు వివిధ గృహ పద్ధతులను ఆశ్రయించేవారు. అలాంటి పద్ధతుల్లో ఒకటి ఉప్పుతో గర్భ పరీక్ష. ఈ పరీక్షలో ఉదయం తీసుకున్న మొదటి మూత్రంలో కొంత ఉప్పు కలిపి కొద్ది సేపు వేచి చూస్తారు. పాలలాంటి స్థిరత్వం కనిపిస్తే గర్భం ఉందని భావించేవారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఇది పూర్తిగా అప్రమేయమైన పద్ధతి. శాస్త్రీయంగా దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పరీక్షలు ఎలాంటి ఖచ్చిత తనూ కలిగించవు పైగా తప్పుదారి పట్టించే అవకాశమూ ఉంది.

ఇది కూడా చదవండి: శరీరంలో కనిపిస్తే ఈ లక్షణాలు ఉంటే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే

కొన్ని గ్రామీణ ప్రాంతాలలో గర్భ ధారణ కిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల మహిళలు ఈ పద్ధతులను ఇంకా పాటిస్తుంటారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా ఇవి ఎక్కువగా ప్రచారంలోకి రావడం వల్ల ప్రజలలో ఆసక్తి కలుగుతుంది కానీ అవి నమ్మదగినవిగా పరిగణించరాదు. శరీరంలో hCG హార్మోన్ ఉన్నప్పుడే గర్భం ఉందని స్పష్టంగా నిర్ధారించగలిగే మార్గం వైద్య పద్ధతులే. కాబట్టి గర్భధారణపై స్పష్టత కావాలంటే ఇంటి గర్భ పరీక్ష కిట్‌ను సరిగ్గా ఉపయోగించాలి లేదా నేరుగా వైద్యుడిని సంప్రదించి మూత్ర పరీక్ష లేదా రక్త పరీక్ష చేయించుకోవడం అత్యంత నమ్మదగిన మార్గం. సరైన సమాచారంతో ముందడుగు వేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వీర్యం తెలుపుకు బదులుగా పసుపులో ఉందా..కారణం ఇదే

( pregnancy-test | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు