/rtv/media/media_files/2025/05/05/5RL6e6JKkYKMzm4EJtTF.jpg)
Sprouted Garlic
Sprouted Garlic: వెల్లుల్లి మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వెల్లుల్లిని నేరుగా తినడం కంటే వాటిని మొలకెత్తించి తినడం వలన రెట్టింపు స్థాయిలో లాభాలు కలుగుతాయని చెప్పవచ్చు. మొలకెత్తిన వెల్లుల్లి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మొలకెత్తిన వెల్లుల్లిలో సాధారణంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల కంటే ఎక్కువగా ఉండి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
రోగనిరోధకశక్తిని పెంచడంలో..
మొలకెత్తిన వెల్లుల్లిలో మెటాబొలెట్స్ అధికంగా ఉంటాయి. ఇవి పలు రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఈ మెటాబొలెట్స్ మొక్కల వృద్ధికి ఉపయోగపడతాయి. వాటిని తింటే మన శరీరంలో కూడా వివిధ రకాల వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. ఇంకా మొలకెత్తిన వెల్లుల్లి పాయలు రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది రక్త సర్క్యులేషన్‌ను మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యం మెరుగుపడడంలో సహాయపడతాయి. ఇలా మొలకెత్తిన వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చదవండి: వేసవిలో ఈ మసాలా దినుసుల జోలికి అస్సలు వెళ్లకండి
క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండేందుకు సహాయపడతాయి, అలాగే క్యాన్సర్‌ను నివారించడంలోనూ వీటి పాత్ర ప్రత్యేకం. అలాగే ఈ వెల్లుల్లిపాయలు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వయస్సు పెరుగుతున్నప్పుడు వచ్చే ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిపాయలు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. చిన్నారులకు వీటిని తీసుకుంటే మెదడు వికసించి, బుద్ధి పెరుగుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిపాయలు రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రోజుకు పావుగంట నవ్వితే ఈ అద్భుత ప్రయోజనాలు
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)