/rtv/media/media_files/2025/10/07/ac-health-tips-2025-10-07-12-30-29.jpg)
AC Health Tips
వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజుల్లో ప్రజలు ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి కళ్లకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏసీ చల్లదనం గాలిలోని తేమను పీల్చేయడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ (Dry Eye Syndrome) కేసులు పెరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. దీనికి తోడు రోజుకు 6 నుంచి 7 గంటలు స్క్రీన్ చూడటం వల్ల కూడా ఈ సమస్య అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కళ్లు మంటగా ఉండటం, దురద, ఎరుపుదనం, దృష్టి మసకబారడం, కళ్లలో నీరు కారడం, వెలుతురును తట్టుకోలేకపోవడం వంటివి డ్రై ఐ సిండ్రోమ్ లక్షణాలు. ఏసీ చల్లదనంతోపాటు సరైన ఆహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్, కాలుష్యం, సరిగా నిద్ర లేకపోవడం కూడా ఈ సమస్యను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజంతా ఏసీలోనే పనిచేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఏసీలో ఎక్కువసేపు ఉంటే శరీరానికి ప్రమాదం:
పొడి చర్మం: ఏసీ గాలి చర్మం, కళ్లను పొడిగా మారుస్తుంది. ఇది చర్మానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది.
డీహైడ్రేషన్: ఏసీ గాలి వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది.
శ్వాస సమస్యలు: సరిగా నిర్వహణ లేని ఏసీ ఫిల్టర్లలోని దుమ్ము, ఫంగస్ కారణంగా అలర్జీలు లేదా ఆస్తమా రావొచ్చు.
బలహీనమైన రోగనిరోధక శక్తి: ఏసీ నుంచి బయటి వేడికి హఠాత్తుగా మారడం వల్ల రోగనిరోధక శక్తి (Immunity) బలహీనపడి జలుబు, ఫ్లూ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా..? ఆరోగ్యం కోసం అద్భుతమైన కూరగాయలను డైట్ చేర్చుకోండి
కీళ్ల నొప్పులు: ఎక్కువసేపు చల్లదనంలో ఉంటే కీళ్ళు, కండరాలలో బిగుతు పెరిగి ఆర్థరైటిస్ సమస్యలు తీవ్రమవుతాయి.
నిస్సత్తువ: నిరంతరం చల్లటి గాలికి గురికావడం వల్ల శరీరం బద్ధకంగా మారి, చురుకుదనం తగ్గుతుంది.
తలనొప్పి, సైనస్: ఏసీ నుంచి వచ్చే చల్లటి, పొడి గాలి సైనస్ సమస్యకు దారితీసి తలనొప్పి, మైగ్రేన్‌కు కారణమవుతుంది.
ఏసీ ఉష్ణోగ్రతను అతి తక్కువగా ఉంచకూడదు. అలాగే గాలి నేరుగా శరీరంపై పడకుండా చూసుకోవాలి. గదిలో తేమ ఉండేలా హ్యుమిడిటీ మెషిన్లను ఉపయోగించడం మంచిది. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. స్క్రీన్ చూసేటప్పుడు కళ్లను ఆర్పడం, పొడి వాతావరణంలో రక్షిత కళ్లద్దాలు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు కళ్లను తేమగా ఉంచే మందులు వాడాలి. డ్రై ఐ సిండ్రోమ్‌ను నిర్లక్ష్యం చేస్తే కార్నియా దెబ్బతిని, దృష్టి లోపించే ప్రమాదం ఉంది. ఈ సమస్య మధుమేహం, థైరాయిడ్ ఉన్నవారికి మరింత ప్రమాదకరం. ప్రారంభంలో గుర్తించినట్లయితే కంటి చుక్కలు, మందులతో సులభంగా చికిత్స చేయవచ్చు.. ఆలస్యమైతే శస్త్రచికిత్స అవసరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దీపావళి నాడు వీటిని చూస్తూ మీకు తిరుగుండదు.. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి!