Diwali 2025: దీపావళి నాడు వీటిని చూస్తే మీకు తిరుగుండదు.. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి!

ఈ సంవత్సరం దీపావళిని సోమవారం అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడం వల్ల గొప్ప ఆర్థిక ప్రయోజనాలు, సురక్షితమైన జీవితం లభిస్తాయి. దీపావళి శుభ సందర్భంగా కొన్ని వస్తువులను చూడటం చాలా శుభప్రదంగా చెబుతారు.

New Update
Diwali  and  Goddess Lakshmi

Diwali and Goddess Lakshmi

ప్రతి సంవత్సరం కార్తీక మాసపు అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళిని సోమవారం అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడం వల్ల గొప్ప ఆర్థిక ప్రయోజనాలు, సురక్షితమైన జీవితం లభిస్తాయి. దీపావళి రోజున ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాలలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. దీపావళి శుభ సందర్భంగా కొన్ని వస్తువులను చూడటం చాలా శుభప్రదంగా చెబుతారు. అవి జీవితంలో సానుకూలతను, సంపదను పెంచుతాయని నమ్ముతారు. దీపావళి రోజున చూడవలసిన శుభ సంకేతాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌ తెలుసుకుందాం.

దీపావళి రోజున చూడవలసిన శుభ సంకేతాలు:

గుడ్లగూబ (Owl):

  • పురాణాల ప్రకారం.. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. దీపావళి రోజున గుడ్లగూబను చూస్తే మీకు త్వరలో లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని అర్థం. ఇది ఆర్థిక సమస్యలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఈ శుభ సంకేతాన్ని విస్మరించకూడదు.

తామర పువ్వు (Lotus Flower):

  • లక్ష్మీదేవి తామర పువ్వుపై కూర్చొని.. చేతిలో తామర పువ్వును పట్టుకుని కనిపిస్తుంది. దీపావళి రోజున తామర పువ్వును చూస్తే.. సంపద పెరుగుతుందని.. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున లక్ష్మీదేవికి తామర పువ్వును సమర్పించడం కూడా చాలా శుభప్రదం.

ఇది కూడా చదవండి: ఈ 5 ఫుడ్ ఐటెమ్స్ కుక్కర్‌లో ఉడికిస్తే డేంజర్.. విషంతో సమానం.. లిస్ట్ ఇదే!

కాకి (Crow):

  • దీపావళి సందర్భంగా కాకి కనిపిస్తే.. అది మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తున్నాయని సూచించవచ్చు. పురాణాలలో కాకిని పూర్వీకులకు ప్రతీకగా కూడా వర్ణించారు.

ఆవులు, బల్లి, కిన్నెరలు (Kinnars):

  • దీపావళి పండుగ రోజున ఆవులు, బల్లి, కిన్నెరలు కనిపించడం చాలా శుభప్రదంగా చెబుతారు. ఈ సంకేతాలను చూడటం జీవితంలో శుభ సమయాలు ప్రారంభమవుతాయని, సానుకూల శక్తి పెరుగుతుందని సూచిస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 
 
ఇది కూడా చదవండి: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా..? ఆరోగ్యం కోసం అద్భుతమైన కూరగాయలను డైట్ చేర్చుకోండి

Advertisment
తాజా కథనాలు