Tension: టెన్షన్ ఎందుకు దండగా.. ఆయుర్వేదం ఉండగా!!

ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి మన DNAను కూడా దెబ్బతీస్తుంది. ఇది క్రోమోజోమ్‌లను రక్షించే టెలోమియర్లను తగ్గిస్తుంది.. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Tension

Tension

నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి (Stress) దాదాపు అందరినీ వేధిస్తోంది. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, సంబంధాల గొడవలు లేదా సోషల్ మీడియాలో సంపూర్ణంగా కనిపించాలనే ఒత్తిడి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒత్తిడి కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు. ఇది అనేక శారీరక వ్యాధులకు మూలకారణంగా మారుతోంది. దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి మన DNAను కూడా దెబ్బతీస్తుంది. ఇది క్రోమోజోమ్‌లను రక్షించే టెలోమియర్లను తగ్గిస్తుంది.. దీనివల్ల వృద్ధాప్యం వేగవంతమవుతుంది, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. టెన్షన్ తీసుకోవడం వల్ల మనసుకే కాదు శరీరానికి కూడా హాని కలుగుతుందో..? ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

జ్ఞాపకశక్తికి నష్టం:

ఒత్తిడి సమయంలో విడుదలయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ మెదడులోని హిప్పోక్యాంపస్ భాగాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా జుట్టుకు రంగు ఇచ్చే మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతిని.. జుట్టు అకాలంగా నెరిసిపోతుంది. దీన్నే మేరీ ఆంటోనిట్టే సిండ్రోమ్ అంటారు. తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడి వల్ల గుండె ఎడమ వైపు బెలూన్ లాగా ఉబ్బే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి మన నాలుకపై రుచిని గుర్తించే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఈ డైట్ ప్లాన్ ఒకే రోజు ట్రై చేయండి.. శరీరంలోని అన్ని మలినాలను తరిమి కొడుతుంది

దీనివల్ల ఆహారం రుచి లేనట్లుగా అనిపించడం లేదా కొన్నిసార్లు లోహపు రుచి (Metallic taste) రావచ్చు. మంచి బ్యాక్టీరియా లోపం ఏర్పడి జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కొందరిలో స్లీప్ పారాలసిస్ వంటి సమస్యలు.. లేనివి ఉన్నట్లు అనిపించడం కూడా జరగవచ్చు. ఒత్తిడిని చిన్న సమస్యగా భావించకుండా.. సరైన జీవనశైలి మార్పులతో దీనిని నియంత్రించుకోవడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం తర్వాత ఈ ఆకు తింటున్నారా..? నోటి దుర్వాసనతో పాటు మరెన్నో సమస్యలకు చెక్

Advertisment
తాజా కథనాలు