Men Weight: వివాహం తర్వాత పురుషులు బరువు పెరగడం వెనుక ఉన్న అసలైన కారణాలు

వివాహం తర్వాత జీవనశైలిలో వచ్చే మార్పులు, అలవాట్లు, కొత్త బాధ్యతలు వల్ల బరువు పెరుగుతారు. వివాహం తర్వాత పురుషులపై కుటుంబ బాధ్యతలు మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఈ ఒత్తిడితో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరిగి, బొడ్డుపై కొవ్వు పేరుకుపోతుంది.

New Update

Men Weight: చాలా మందిలో వివాహం అనంతరం పురుషులలో బరువు పెరగడం కనిపించే సమస్య. ఇది ఒక్క వ్యక్తికే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషులకు  ఒక సాధారణ సమస్య. వివాహం తర్వాత జీవనశైలిలో వచ్చే మార్పులు, అలవాట్లు, కొత్త బాధ్యతలు మొదలైనవన్నీ కలిసి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ప్రారంభంలో చిన్నచిన్న మార్పులుగానే కనిపించినా.. కాలక్రమేణా ఇది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుతుంది. వివాహానంతర జీవితంలో ప్రధానంగా ఎదురయ్యే మార్పుల్లో ఒకటి వ్యాయామానికి సమయం లేకపోవడం. ఇంటి బాధ్యతలు, ఉద్యోగ సంబంధిత ఒత్తిడులు, పిల్లల సంరక్షణ మొదలైనవన్నీ కలిసి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. 

కార్టిసాల్ అనే హార్మోన్ పెరగటం వల్ల..

దాంతోపాటు సాధారణంగా ఇంట్లో వండే ఆహారం చాలా రుచికరంగా ఉండే అవకాశముంది. భార్యలు ప్రేమతో వండి పెట్టే నూనె, మసాలాలు అధికంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక కేలరీలు చేరతాయి. అదనంగా పండుగలు, కుటుంబ వేడుకలు, బంధువుల ఆతిథ్యం లాంటి సందర్భాల్లో అధికంగా తింటారు. ఇంకో ముఖ్యమైన అంశం ఒత్తిడి. వివాహం తర్వాత పురుషులపై కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఈ ఒత్తిడితో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరిగి, బొడ్డుపై కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది.

ఇది కూడా చదవండి: రాత్రి నిద్రకు ముందు ఇలాంటి దుస్తులకు దూరంగా ఉండండి

అదనంగా నిద్రలేమి కూడా జీవక్రియలను దెబ్బతీసి, శరీరంలోని కొవ్వు నిల్వలపై ప్రభావం చూపుతుంది. వయస్సు పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతూ, కండరాల స్థానంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం పెరుగుతుంది. వివాహం తర్వాత మద్యం సేవించే అలవాటు పెరగడం కూడా బీర్ బెల్లీకి కారణం కావచ్చు. ఆల్కహాల్‌లో అధిక కేలరీలు ఉండడం, ఇన్సులిన్ నిరోధకత పెరగడం, కాలేయంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్య తగ్గాలంటే వ్యాయామం  , ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర, యోగా, ధ్యానం వంటి  చేయాలని నిపుణులు చెబుతున్నారు.

body weight | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు