/rtv/media/media_files/2025/05/19/dSo492TQabgTtYTJgAgX.jpg)
Reheat food
Food Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. నేటి కాలంలో ఉద్యోగాలు చేస్తూ బీజీగా ఉండటం వలన వంట చేసే సమయంలో చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల కొందరూ ఎక్కువ ఆహారం వండి ఫ్రీడ్జ్‌లో పెట్టుకుని దానిని మళ్లీ వేడి చేసుకుని తింటారు. ఇలా చేయటం వల్ల అరోగ్యానికి అనేక రకాలుగా హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు తెలిసీ తెలియకుండానే వంటగదిలో కొన్ని పొరపాట్లు చేస్తారు. ముఖ్యంగా వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడంలో మహిళలు కొన్ని ప్రధాన తప్పులు చేస్తుంటారు. వీటి వల్ల ఆహార రుచి తగ్గడంతోపాటు ఆరోగ్యానికి ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పోషకాలు నశించిపోతాయి:
మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కదిలించకుండా ఉండటమే. మైక్రోవేవ్‌లో వేడి అసమానంగా వ్యాపిస్తుంది. అందువల్ల ఆహారం సమానంగా వేడెక్కదు. ఇది రుచి మీదకాక కొన్ని ప్రాంతాలు తగినంత వేడి కాకపోవడం వల్ల అవి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆహారాన్ని అతిగా వేడి చేయడం వల్ల ఆహారంలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయి. దీంతో ఆహారం రుచిని కోల్పోవడంతోపాటు దాని ఆరోగ్య ప్రాధాన్యత తగ్గిపోతుంది. మైక్రోవేవ్‌కు అనుకూలం కాని ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని వేడి చేయడం. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ నుంచి హానికరమైన రసాయనాలు ఆహారంలోకి చొచ్చుకుపోతాయి. ఇవి ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగించవచ్చు.
ఇది కూడా చదవండి: మామిడి తొక్కలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా ట్రై చేసి తినండి
మూత లేకుండా ఆహారాన్ని వేడి చేయడం వల్ల ఆహారం ఎండిపోతుంది, కఠినమవుతుంది, తినడానికి నొప్పిగా మారుతుంది. వేడి చేసిన ఆహారాన్ని వెంటనే ప్లేట్‌లో వడ్డించడం ఒక తప్పు. వేడి చేసిన తర్వాత కొన్ని నిమిషాలు ఆహారాన్ని నిలిపివేసి చల్లబరచితే అది సమానంగా వేడెక్కుతుంది. నోరు కాలే ప్రమాదం తగ్గుతుంది. ఎక్కువసేపు వదిలిపెట్టిన పాత ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం. ఎక్కువకాలంగా ఉన్న ఆహారంలో బ్యాక్టీరియా పెరిగే ఆహార విషంగా మారుతుంది. వేడి చేసే సమయంలో మీడియం మంటను ఉపయోగించకుండా అధిక మంటను వాడటం. ఇది ఆహారాన్ని బాగా వేడి చేయడం కంటే దానిని కాల్చి పోషకాలు నశించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
(food-tips | child-food-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)
ఇది కూడా చదవండి: వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా..? ఈ ఐదుగురికి దుష్ప్రభావాలను కలిగిస్తుంది