Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

ప్రియాంక చోప్రా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆస్తమా కారణంగా తాను తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు. ఆ సమయంలో జీవితం చాలా భయంకరంగా ఉండేదని భావోద్వేగానికి గురయ్యారు.

New Update
Priyanka chopra asthma

Priyanka chopra asthma

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యానికి (Health) సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడారు. ఆస్తమా కారణంగా తాను తీవ్ర నిరాశకు  గురైనట్లు తెలిపారు. కరోనా సమయంలో తనకు ఆస్తమా ఉండడంతో చాలా భయపడినట్లు చెప్పారు. ఆ సమయంలో జీవితం చాలా భయంకరంగా ఉండేదని భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ తర్వాత తాను ఆస్తమాకు సంబంధించి ఓ శస్త్రచికిత్స చేయించుకున్నారట.  కానీ అందులో ఓ సమస్య రావడంతో మరింత నిరాశకు గురైనట్లు తెలిపారు. అందుకే తాను బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని అన్నారు. అయితే ప్రియాంక 5 సంవత్సరాల నుంచే ఆస్తమాతో బాధపడుతున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

Also Read :  అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

అసలు ఆస్తమా అంటే ఏంటి?

ఆస్తమా (Asthama) అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. వాయునాలలో వాపు, శ్వాస ఆడకపోవడం, ఛాతి నొప్పి, నిరంతర దగ్గు దీని ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు శీతాకాలంలో మరింత ఇబ్బంది పెడతాయి. ఇది పెద్దలు, వృద్ధులను మాత్రమే కాకుండా చిన్న పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది. సరైన చికిత్స, జాగ్రత్తలతో దీనిని నివారించవచ్చు. కానీ లక్షణాలను విస్మరించడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. 

Also Read :  అదిరింది.. 'చిన్న రాములమ్మ' పాటకు సందీప్ స్టెప్పులు.. లైవ్ షూటింగ్ వీడియో!

priyanka
priyanka

Also Read :  'తండేల్' థియేటర్లో సాయిపల్లవి స్టెప్పులేస్తూ కుర్రోళ్లు రచ్చ రచ్చ ..!

ఆస్తమా వల్ల కలిగే  ప్రమాదాలు?

ఆస్తమా ఉన్నవారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. గురక సమస్య కూడా తలెత్తుతుంది. దీని కారణంగా  శ్వాస ప్రక్రియకు అంతరాయం కలగవచ్చు. పెరుగుతున్న కాలుష్యం, జీవశైలి అలవాట్లు అనేక కారణాలు ఆస్తమాకు దారితీయవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుప్పొడి, దుమ్ము కణాలు, ఫంగస్,  జంతువుల వెంట్రుకలు అలెర్జీకి కారణాలు కావచ్చు. ఆస్తమా ఉన్నవారు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే సమస్య ఎక్కువవుతుంది. బయటకు వెళ్ళినప్పుడు  దుమ్ము,  కాలుష్యాన్ని నివారించడానికి సాధ్యమైన చర్యలు తీసుకోండి. 

వైరల్ ఇన్ఫెక్షన్ 

జలుబు లేదా ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వాయుమార్గాలను ప్రభావితం చేస్తాయి.  ఇది ఆస్తమా లక్షణాలను తీవ్రం చేస్తుంది. కావున ఆస్తమా రోగులు జలుబు, ఫ్లూ సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 

Also Read :  మోనాలిసాకు మరో లక్కీ ఛాన్స్! ఏకంగా..

Advertisment