/rtv/media/media_files/2025/02/15/pQPaHmUabzFcXWlqdeiR.jpg)
Monalisa photo
Monalisa: మహాకుంభమేళలో పూసలు దండలు అమ్ముకుంటున్న మోనాలిసా సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో వైరలైన ఆ ఒక్క వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె నీలికళ్ళు, అమాయకపు చూపులకు ఫిదా అయిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. హీరోయిన్ ఛాన్స్ తో ఒక్కసారిగా మోనాలిసా క్రేజ్ మరింత పెరిగిపోయింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, ఈవెంట్లకు ఆమెను గెస్టుగా ఆహ్వానిస్తున్నారు.
మరో అదృష్టం..
ఈ క్రమంలో ఇటీవలే కేరళలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి గెస్టుగా వెళ్లగా.. ఇంతలోనే మరో అదృష్టం కలిసొచ్చింది మొనాలిసాకు. ఈనెల 26న నేపాల్ లో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. ఇలా వరుస ఈవెంట్లలో సందడి చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది మోనాలిసా. అయితే కేరళలో మోనాలిసా మాల్ ఓపెనింగ్ కి వెళ్లడంతో .. ఆమెను చూసేందుకు జనం అక్కడికి గుంపులు గుంపులుగా వచ్చారు. ఆమెతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో త్వరలోనే టీవీ షోలలో కూడా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు నెటిజన్లు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న 'ది డైరీ ఆఫ్ మణిపూర్' లో మోనాలిసా హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే డైరెక్టర్ ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పనులు కూడా పూర్తి చేశారు. ఆయనే స్వయంగా మోనాలిసా ఇంటికి వెళ్లి సినిమాలో నటించేందుకు ఆమె తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకున్నారు. ప్రేమకథ, స్థానిక సమస్యల నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మోనాలిసా రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తెగా కనిపించనుంది. దాదాపు 20 కోట్లు బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి మోనాలిసా షూటింగ్ లో పాల్గొననుంది.
Also Read: Malayalam Film Industry: మలయాళం ఇండస్ట్రీలో అన్నీ బంద్.. జూన్ 1 నుంచి ఏం జరగబోతుందంటే