/rtv/media/media_files/2025/02/17/su4NKohJU8R9Tq6ZkSNu.jpg)
thandel viral video
Thandel Viral video: నాగచైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని సాధించింది. విడుదలైన పది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఇందులోని పాటలు కూడా అంతే హిట్ అయ్యాయి. బుజ్జితల్లి, హైలెస్సా.. ఇలా ప్రతీ పాట చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. థియేటర్ల లో ఈ పాటలు వస్తున్నప్పుడు ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సీట్ల పై నుంచి లేచి వాళ్ళు కూడా డాన్సులు వేస్తున్నారు.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
వీడియో షేర్ చేసిన బన్నీ వాసు..
అయితే తాజాగా ఓ థియేటర్లో కొంతమంది అబ్బాయిలు 'హైలెస్సా' పాటకు స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది. స్క్రీన్ పై చూస్తూ అచ్చం సాయి పల్లవిలానే నడుము తిప్పుతూ భలే డాన్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. ఆ వీడియోను నిర్మాత బన్నీ వాసు కూడా తన తన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇది ఇలా ఉంటే యూట్యూబ్ లో 'బుజ్జితల్లి' సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దుమ్మురేపుతోంది. తాజాగా 100 మిలియన్ వ్యూస్ హిట్ చేసింది.
😆😆😆 pic.twitter.com/2ZoSEpN0ew
— Bunny Vas (@TheBunnyVas) February 16, 2025
ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. అంతేకాదు ప్లే లిస్టులో అత్యంత ఇష్టమైన పాటగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు రూ. 75 కోట్లతో రూపొందిన ఈమూవీ ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల వసూళ్లను సాధించింది. ఇంకా థియేటర్స్ లో జోరు కొనసాగిస్తూనే ఉంది.
Also Read: Tejaswi Madivada: తేజస్వి అందాల విధ్వంశం.. క్రీమ్ కలర్ డ్రెస్ లో హీటేక్కిస్తున్న బ్యూటీ