Pregnant
Pregnant: గర్భం దాల్చినప్పటి నుంచి మొదటి మూడు నెలలు తల్లి శారీరకంగా, మానసికంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ కాలం శిశువు ప్రాథమిక అవయవాల అభివృద్ధికి అత్యంత కీలకం. తల్లి కడుపులో పిండం వేళ్లు, కాలి వేళ్లు, గుండె, నరాలు, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలను అభివృద్ధి చేసుకునే దశలో ఉంటుంది. అలాగే రెండవ నెల నుంచి నాడీ వ్యవస్థ, మూత్ర నాళం, కడుపు వంటి అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మూడవ నెల నాటికి జననేంద్రియాలు, గోళ్లు, కనురెప్పలు వంటి వాటి రూపకల్పన జరుగుతుంది. ఈ సమయంలో తల్లి తీసుకునే పోషకాహారం, ఆరోగ్యవంతమైన జీవనశైలి శిశువు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి.
ప్రోటీన్‌లు అధికంగా ఉండే..
కాబట్టి, మంచి ఆహారం, పర్యావరణం, విశ్రాంతి అన్నీ సమతుల్యంగా ఉండాలి. ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి. బయటి ఆహారాలను తప్పించాలి, ఎందుకంటే అవి హానికరమైన రసాయనాలను కలిగి ఉండవచ్చు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, కాల్షియం, ప్రోటీన్‌లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. సప్లిమెంట్లు తీసుకోవాలంటే వైద్యుడి సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. ఈ సమయంలో వాంతులు, తినే విషయంలో చిరాకు, వాసనల పట్ల అసహనత వంటివి సాధారణంగా ఎదురవుతాయి. ఈ కారణంగా తల్లులు ఒకేసారి ఎక్కువగా తినకుండా, తక్కువ తిండి ఎక్కువ సార్లు తీసుకోవడం ఉత్తమం. ఇది జీర్ణానికి, శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: కాఫీ పౌడర్‌తో అవాంఛిత రోమాలు తొలగించవచ్చా?
అంతేకాకుండా మంచి నిద్రను కొనసాగించడం అవసరం. నిద్ర వల్ల శరీరానికి అవసరమైన విశ్రాంతి లభించి, హార్మోన్ల సమతుల్యత కొనసాగుతుంది. శారీరకంగా శ్రమకలిగే పనులు, ఎక్కువ ఒత్తిడిని కలిగించే వాతావరణం నివారించాలి. వ్యాయామం చేయాలనుకుంటే వైద్యుడి అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా పొగతాగడం, మద్యం సేవించడం, ధూమపానం చేసే వ్యక్తులతో మినిమమ్ కనెక్ట్ కూడా పెట్టుకోకూడదు. ఇవన్నీ శిశువు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మొదటి మూడు నెలల జాగ్రత్తలు తల్లి-బిడ్డ ఆరోగ్యానికి పునాది వేసే సమయం. ఈ దశలో తీసుకునే మంచి నిర్ణయాలు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన బిడ్డ జననానికి దారి తీస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రాత్రంతా ఏసీ వాడుతున్నారా..అయితే జాగ్రత్త
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news | baby )