/rtv/media/media_files/2025/04/24/XcrlDR6ANBe4m4eZx9tS.jpg)
AC
AC: వేసవిలో ఎయిర్ కండిషనర్ వినియోగం అనివార్యంగా మారినప్పటికీ దీనిని ఎలా వాడుతున్నా మన్నదే ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశం. చాలామంది AC ఉష్ణోగ్రతను 16-18 డిగ్రీల వరకు తగ్గిస్తారు. కానీ ఇది శరీర ఉష్ణోగ్రతపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. సరైన నిద్ర కోసం 24-26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉన్నప్పుడు శరీరం తేలికగా కలిసిపోయి విశ్రాంతినిస్తుంది. అదేవిధంగా స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్టింగ్స్ ఉపయోగించడం వల్ల రాత్రంతా AC పనిచేయకుండా, అవసరమైనంత వరకే వాడటంతో విద్యుత్తు ఖర్చు తగ్గుతుంది.
నేరుగా శరీరాన్ని తాకినపుడు..
గది తేమను కోల్పోకుండా ఉంటుంది. రాత్రిపూట బెడ్‌ను AC గాలి డైరెక్టుగా తాకకుండా సర్దుబాటు చేయడం చాలా ముఖ్యం. చల్లని గాలి నేరుగా శరీరాన్ని తాకినపుడు మెడ నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 3-4 అడుగుల దూరంలో బెడ్‌ను ఉంచడం శ్రేయస్కరం. అదే విధంగా గదిలో గాలి ప్రసరణ సమంగా జరిగేలా తక్కువ వేగంతో సీలింగ్ ఫ్యాన్‌ను ఉపయోగించాలి. మరొక ముఖ్యమైన విషయం C ఫిల్టర్ శుభ్రత. ఫిల్టర్‌లు కాలుష్యకారకాలు, ధూళి, బ్యాక్టీరియాలను నిలుపుకుంటాయి.
ఇది కూడా చదవండి: పొడవాటి జుట్టు కోసం గ్లిజరిన్ వాడండి
వీటిని శుభ్రం చేయకుండా వాడితే శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. ముఖ్యంగా అలెర్జీ లేదా ఉబ్బసం ఉన్నవారికి. కనీసం ప్రతి రెండు మూడు వారాలకు ఫిల్టర్‌ను శుభ్రం చేయడం లేదా అవసరమైతే మార్చేయడం ఉత్తమం. రాత్రిపూట AC వాడుతున్నప్పుడు నీరు ఎక్కువ తాగాలి. చర్మం, గొంతు ఎండిపోవడం అనేది చాలా సాధారణం. కాబట్టి దగ్గరలో నీటి బాటిల్ ఉంచుకోవడం మంచిది. ఇవన్నీ పాటిస్తే AC వాడకాన్ని ఆరోగ్యానికి హానికరం కాకుండా, సురక్షితంగా మార్చుకోవచ్చు. AC వాడడం అనేది అవసరం కానీ అతి మోతాదులో లేదా పొరపాటుగా వాడితే ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: మీకు బాగా దప్పిక వేస్తుందా? అయితే ఆ వ్యాధులు ఉన్నట్లే..!!
( home-tips | home tips in telugu | latest-news)