Swimming: వేసవిలో ఈతకు వెళ్లేప్పుడు ఈ విషయాలను మర్చిపోవద్దు

వేసవి వేడిలో ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. ఉదయం 10 నుంచి 4 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉండే సమయంలో సన్‌స్క్రీన్ వాడాలి. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. డీహైడ్రేషన్‌ నుంచి రక్షణ కోసం రోజంతా తగినంత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
swimming

swimming

Swimming: వేసవి కాలంలో వేడి కారణంగా అలసట, డీహైడ్రేషన్ వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో చల్లదనం కోసం చాలామంది ఈతను ఎంచుకుంటారు. ఇది తాత్కాలికంగా మాత్రమే కాకుండా శరీరానికి లాభదాయకంగా పనిచేసే ఆరోగ్యకరమైన అలవాటు కూడా. నీటిలో ఈత కొట్టడం వల్ల శరీరం చల్లబడటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు, ఒత్తిడి, కండరాల బలహీనతలకు ఉపశమనం లభిస్తుంది. ఈత సమయంలో శరీరంలోని ప్రతీ భాగం కదలికలో ఉంటుంది. ఫలితంగా ఇది పూర్తిస్థాయి వ్యాయామంగా మారుతుంది. గుండె పని తీరు మెరుగవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వినోదం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా చూస్తే ఈత మానసిక ప్రశాంతతనూ అందిస్తుంది.

ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో..

నిరంతరం పని ఒత్తిడిలో ఉండేవారు, ఎమోషనల్‌గా దిగులుగా ఉండేవారికి నీటిలో గడిపిన కొద్దిసేపు ఎంతో ఉపశమనం ఇస్తుంది. అలసట, ఆందోళన తగ్గిపోతాయి. అంతేకాక ఈత వల్ల శరీరంలో మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈతను వారపు వ్యాయామంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కేలరీల ఖర్చుతో పాటు శరీర ఆకృతిలోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఇక నిద్ర లేమితో బాధపడేవారికి కూడా ఇది సహజ చికిత్స. శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కలగడం వల్ల రాత్రిపూట నిద్ర బాగా వస్తుంది. ఇది చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మంచిదే. ముఖ్యంగా పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఈత ఓ మంచి సాధనం. 

ఇది కూడా చదవండి: ఈ వస్తువులను తాకిన వెంటనే చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు

నీటిలో కదలికలతో పాటు తేలుతూ, చురుకుగా ఉండే సామర్థ్యం వ్యక్తిత్వంలో ధైర్యాన్ని పెంచుతుంది. అయితే వేసవి వేడిలో ఈత కొట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉండే సమయంలో సన్‌స్క్రీన్ తప్పక వాడాలి. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఈత కొలను శుభ్రంగా ఉండాలి. నీటిలో తగినంత క్లోరిన్ లేకపోతే చర్మ సమస్యలు కలుగవచ్చు. ముఖ్యంగా దద్దుర్లు, అలెర్జీలు ఏర్పడే అవకాశం ఉంది. నీటిలో గడిపే ముందు, తర్వాత శరీరానికి తగినంత నీటిని అందించండి. డీహైడ్రేషన్‌ నుంచి రక్షణ కోసం రోజంతా తగినంత నీరు తాగడం అవసరం.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు