/rtv/media/media_files/2025/04/17/vnmtaPCz2XhY8GZtpcHT.jpg)
Hands Washing
Hands Washing: మన రోజువారీ జీవితంలో అనేక వస్తువులను తాకడం సహజం. కానీ అవి మన ఆరోగ్యానికి ఎంతవరకు ముప్పుగా మారవచ్చు చాలా మందికి తెలియదు. కొన్ని వస్తువులు మన చేతుల ద్వారా వందలాది సూక్ష్మక్రిములను మన శరీరంలోకి ప్రవేశపెడతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నగదు నోట్లు అనేవి ఒకరి నుంచి మరొకరికి తిరుగుతూ లక్షలాది బ్యాక్టీరియా, వైరస్‌లను కలిగి ఉంటాయి. న్యూయార్క్‌లో నిర్వహించిన అధ్యయనంలో నోట్లపై మనుషుల DNA, బ్యాక్టీరియా, వైరస్‌లు, జంతువుల ఆనవాళ్లు కూడా కనుగొన్నారు.
ప్రమాదకరమైన వైరస్‌ల నిలయంగా..
నోట్లను తాకిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే రెస్టారెంట్‌లలో మెనూ కార్డులు కూడా ప్రమాదకరం. ఒక్కో మెనూ కార్డు మీద దాదాపు 1.85 లక్షల బ్యాక్టీ రియా ఉంటాయని అరిజోనా యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలింది. అందుకే మెనూ కార్డును తాకిన తర్వాత తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి. అదే విధంగా ఆసుపత్రుల్లోని వస్తువులు కూడా ప్రమాదకరమైన వైరస్‌ల నిలయంగా మారతాయి. బెంచీలు, డోర్ హ్యాండిల్స్, బయోమెట్రిక్ ప్యాడ్‌లు మొదలైన వాటిని తాకిన తర్వాత చేతులు కడుక్కోవడం ద్వారా అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: మీరు పడుకునేటప్పుడు ఫోన్ చూస్తారా?
ప్రజా రవాణా వాహనాలు కూడా క్రిముల సంచార కేంద్రాలుగా మారుతున్నాయి. బస్సులు, రైళ్లు, మెట్రోలలోని హ్యాండిల్స్, సీట్లు, డోర్ నాబ్‌లు వందలాది మంది చేతుల వలన సూక్ష్మక్రిములతో నిండి ఉంటాయి. కాబట్టి ప్రయాణం తర్వాత శానిటైజర్ వాడటం లేదా చేతులు కడుక్కోవడం తప్పనిసరి. అంతేకాదు కార్యాలయాలలో వాడే పెన్సిల్‌లు, పెన్నులు కూడా భయంకరమైన క్రిములవల్ల కలుషితమవుతాయి. ఒక పెన్నులో టాయిలెట్ సీటుకన్నా పది రెట్లు ఎక్కువ క్రిములు ఉండవచ్చు. కాబట్టి వేరొకరి పెన్ను ఉపయోగించిన వెంటనే చేతులు కడుక్కోవాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మామిడి పువ్వులతో కూడా పుట్టెడు లాభాలు తెలుసా?
( washing-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)