Womens Day 2025: మహిళా దినోత్సవం సందర్భంగా నీతా అంబానీ తన ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. కాలంతో పాటు శరీరంలోనూ మార్పులు చోటు చేసుకుంటాయని, కండరాలు, ఎముకల సాంద్రత తగ్గిపోతుందని, అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని నీతా అంబానీ చెబుతున్నారు. నడక అనేది శరీరానికి శక్తిని ఇస్తుందని, బలం, మెటాబాలిజం తగ్గుతున్నట్లు అనిపిస్తే ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత లెగ్ వర్కౌట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లెగ్ వర్కౌట్ అంటే తనకు ఎంతో ఇష్టమని నీతా అంబానీ చెప్పుకొచ్చారు. తాను ఓ నర్తకిని అని, ఆరు సంవత్సరాల వయసు నుంచే భరతనాట్యం చేస్తున్నానని నీతా అన్నారు.
7 వేల స్టెప్స్ వరకు నడుస్తానని...
కొన్ని రోజులు కాళ్లు, కొన్నిసార్లు శరీరంపై భాగాలపై దృష్టి పెడతానని చెప్పారు. అంతేకాకుండా నీతా అంబానీ వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వ్యాయామం చేస్తానని చెప్పారు. వాకింగ్, బాడీ ఫ్లెక్సిబిలిటీ, యోగా, స్ర్టెంత్‌ని పెంచడంపై దృష్టి సారిస్తారట. కొన్ని రోజుల పాటు ఒక గంట డాన్స్ కూడా చేస్తానని చెప్పారు. డాన్స్ చేయటం అంటే తనకు చాలా ఇష్టమని చెబుతున్నారు. ఏదైనా టూర్‌లో ఉంటే కనీసం 5 నుంచి 7 వేల స్టెప్స్ వరకు నడుస్తానని చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే తనకు సమతుల్య ఆహారం ఇష్టమని, తాను శాఖాహారినని, సహజమైన, ఆర్గానిక్ ఫుడ్ అంటే ఇష్టమని నీతా చెప్పారు. ప్రతి ఒక్కరు ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యమని, చక్కెరకు దూరంగా ఉండాలని నీతా చెబుతున్నారు. వ్యాయామం తనను రిలాక్స్‌గా ఉంచుతుందని, వ్యాయామం తర్వాత రోజంతా నేను మరింత పాజిటివ్‌గా ఉంటానని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే పుట్టగొడుగులు తినొద్దు
వ్యాయామంతో ఆనందం హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. బరువు ఎత్తడం మాత్రమే కాదు మన వాళ్లతో రోజంతా గడపాలంటే చాలా బలం కావాలి. వయసు పెరిగే కొద్దీ జీవించడం నేర్చుకోవాలని నీతా అంబానీ అంటున్నారు. 61 ఏళ్ల వయసులో నేను ఇవన్నీ చేయగలిగినప్పుడు మీరు చేయగలరని నీతా అంటున్నారు. అవసరాలను అర్థం చేసుకుని వ్యవహరించాలి. రోజుకి 30 నిమిషాలు వారానికి నాలుగు రోజులు అయినా వ్యాయామంపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు. మీలో బలం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కాబట్టి మొదటి అడుగు మీ ఆరోగ్యం కోసం వేయండి, ముందుకు సాగండి అని నీతా అంబానీ అంటున్నారు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. అన్ని వయస్సుల వారు ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నీతా అంబానీ తెలిపారు. అంతేకాకుండా జీవనశైలి, ఆహారపు అలవాట్లతోపాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నీతా అంబానీ చెప్పుకొచ్చారు. అప్పుడే ప్రతీ ఒక్కరు ఆరోగ్యంతో మరింత దృఢంగా ఉంటారని, దీంతో మరిన్ని విజయాలు సాధిస్తారని నీతా అంబానీ ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: రోజూ గుమ్మడికాయ రసం తీసుకుంటే ఈ రోగాలన్నీ మాయం