Navaratri 2025: అక్టోబర్ 1 లేదా 2.. నవరాత్రి ఉపవాసం ముగించడానికి సరైన రోజు ఏదో తెలుసా?

శరన్నవరాత్రులు అక్టోబరు 1న ముగుస్తున్నాయి. 9 రోజులు ఉపవాసం పాటించిన భక్తులు ఉపవాసాన్ని ఏ రోజు విరమించాలి అనే దానిపై గందరగోళం ఉంది. ఏ రోజు ఉపవాసం విరమించాలి, శుభ సమయాన్ని ఎలా పాటించాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Navaratri 2025

Navaratri 2025

శరన్నవరాత్రులు 2025(Devi Navaratri 2025) లో సెప్టెంబరు 22న ప్రారంభమై అక్టోబరు 1న ముగుస్తున్నాయి. తొమ్మిది రోజులు ఉపవాసం పాటించిన భక్తులు ఉపవాసాన్ని(fasting) ఏ రోజు విరమించాలి అనే దానిపై గందరగోళం ఉంది. కొందరు అష్టమి రోజు, కొందరు నవమి రోజు, మరికొందరు దశమి రోజు ఉపవాస దీక్షను విరమిస్తారు. మీరు ఏ నాడు ఉపవాసం విరమించాలి, శుభ సమయాన్ని ఎలా పాటించాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఉపవాస దీక్షను విరమించేటప్పుడు.. 

ఈ సంవత్సరం దుర్గాష్టమి తిథి సెప్టెంబరు 30న ఉంది. అష్టమి తిథి ఆ రోజు సాయంత్రం 6:06 గంటలకు ముగుస్తుంది. కన్యా పూజ తర్వాత ఉపవాసం విరమించాలనుకునేవారు ఈ సమయం తర్వాత పారణ చేయవచ్చు.

నవమి పారణ సమయం: కొందరు నవమి రోజు కన్యా పూజ లేదా హోమం చేసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. అక్టోబరు 1న నవమి తిథి సాయంత్రం 7 గంటల వరకు ఉంది. ఈ సమయం తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు.

ఇది కూడా చదవండి: శారదీయ నవరాత్రి పూజలో ఈ పండ్లు పెట్టే పొరపాటు చేయొద్దు!

దశమి పారణ సమయం: తొమ్మిది రోజులు పూర్తి ఉపవాసం పాటించిన వారికి దశమి తిథి రోజు ఉపవాసం విరమించడం శుభప్రదం. అక్టోబరు 2న విజయదశమి. ఆ రోజు దశమి తిథి బలంగా ఉన్నందున ఉదయం 6:15 గంటల తర్వాత ఉపవాసాన్ని విరమించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. నవరాత్రి ఉపవాస దీక్షను విరమించేటప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా ఉప్పు కలిపిన ఆహారాన్ని తీసుకోకూడదు. అమ్మవారికి సమర్పించిన ప్రసాదంతో పారణ చేయడం ఉత్తమం. మీ సంప్రదాయాలు, నమ్మకాలను అనుసరించి సరైన రోజు శుభ సమయంలో ఉపవాస దీక్షను విరమించాలని పండితులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. నివారణకు సంబంధిత పండితులని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నవరాత్రి సమయంలో నాన్‌వెజ్ తినొచ్చా..? తినకూడదా..?.. అసలు ఏం తింటే మంచిది..?

Advertisment
తాజా కథనాలు