/rtv/media/media_files/2025/08/30/lunar-eclipse-2025-08-30-10-57-23.jpg)
lunar eclipse
సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం(lunar-eclipse) రాబోతుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. జ్యోతిష్యం(astrology) ప్రకారం గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో అక్కడి ప్రజల మీదనే దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఈ గ్రహణం వల్ల ఎటువంటి తీవ్రమైన సమస్యలు ఉండవు. అయినప్పటికీ కొన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడనున్నట్లు పండితులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రహణ సమయాల్లో కొన్ని రాశుల వారికి మానసికంగా, ఆర్థికంగా, లేదా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయని పండితులు అంటున్నారు. అయితే ఏయే రాశుల వారికి ఈ చంద్రగ్రహణం వల్ల సమస్యలు వస్తాయో చూద్దాం.
ఇది కూడా చూడండి: Ganesh Chaturthi 2025: ఈ సమయంలో గణపతి పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే.. శుభ ముహూర్తం, పూజా విధానం
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల ఆర్థికంగా కొన్ని సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. అలాగే ఎందులో అయినా పెట్టిన పెట్టుబడులు నష్టాలు వస్తాయి. అన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం అని పండితులు అంటున్నారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా రుణాలకు అయితే దూరంగా ఉండాలి. లేకపోతే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని పండితులు అంటున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం వల్ల కుటుంబ సంబంధాల్లో సమస్యలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా చిన్న విషయాలకు కూడా గొడవలు, అపార్థాలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా చాలా ఓర్పుతో, ప్రశాంతంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అందరి కంటే ముఖ్యంగా భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకుని ప్రశాంతంగా ఉండాలని పండితులు అంటున్నారు.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని పండితులు అంటున్నారు. అలాగే చిన్న సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యంపై అజాగ్రత్త తీసుకోవద్దని పండితులు అంటున్నారు. అలాగే ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా సమయానికి భోజనం చేస్తే జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి వృత్తిపరమైన జీవితంలో కొన్ని అడ్డంకులు వస్తాయి. ప్రతీ పనిలో ఆటంకం ఏర్పడుతుంది. ఉద్యోగులతో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ప్రతీ విషయంలో అసహనం ఏర్పడుతుంది. కోపానికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలని పండితులు అంటున్నారు. ఏ మాత్రం సహనం కోల్పోయిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు.
మీన రాశి
మీన రాశి వారికి ఈ చంద్రగ్రహణం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఆలోచనలు, భయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని పండితులు అంటున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఈ సమస్యల నివారణకు సంబంధిత నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Ganesh Chaturthi 2025: మీ ఇంట్లో గణపతిని పెడుతున్నారా? అయితే.. ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!