Life Style: త్వరగా కోటీశ్వరులు కావాలంటే ఈ ఒక్క పని చేయండి.. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేయాలో తెలుసుకోండి

కోటిని ఆకర్షించడానికి ఉదయం నుంచి రాత్రి వరకు అనుసరించాల్సిన దినచర్యలు కొన్ని ఉన్నాయి. ఉదయం మేల్కొన్న వెంటనే మనస్సులో ఏది గుర్తుకు వస్తే లేదా మీకు ఎదురుగా ఏది కనిపిస్తే దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Millionaires

Millionaires

ప్రతి ఒక్కరూ జీవితంలో ధనవంతులు కావాలని.. దేనికీ లోటు లేకుండా ఉండాలని కోరుకుంటారు. విజయం సాధించడానికి.. డబ్బు సంపాదించడానికి చాలా మంది కష్టపడుతుంటారు. అయితే.. సరైన మానసిక స్థితి (Mental state), దినచర్యను కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. మీరు  కోటిని ఆకర్షించాలని కలలు కంటున్నట్లయితే.. కేవలం ఆలోచించడం సరిపోదు. మీ రోజువారీ అలవాట్లను మార్చుకోవాలి.  కోటిని ఆకర్షించడానికి ఉదయం నుంచి రాత్రి వరకు అనుసరించాల్సిన దినచర్యలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. త్వరగా కోటీశ్వరులు కావాలనుకుంటే.. కొన్ని దినచర్యను పాటించవచ్చు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఉదయం మేల్కొనగానే చేయాల్సినవి..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం లేవగానే పది విషయాలకు కృతజ్ఞతలు చెప్పడం చాలా ముఖ్యం. దీని కోసం ప్రత్యేకంగా లిస్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం మేల్కొన్న వెంటనే మనస్సులో ఏది గుర్తుకు వస్తే లేదా మీకు ఎదురుగా ఏది కనిపిస్తే దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలి. కృతజ్ఞతలు చెప్పిన తర్వాత మ్యాజిక్ వాటర్ తాగాలి. మ్యాజిక్ వాటర్ అంటే ఏమిటంటే.. రాత్రి పడుకునే ముందు ఒక వాటర్ బాటిల్‌పై జీవితంలో ఏమి కావాలో రాయాలి. ఉదయం మేల్కొన్న తర్వాత ఈ బాటిల్‌లోని నీటిని తాగాలి. ఇది వాటర్ బాటిల్ టెక్నిక్. ఉదయం లేచిన తర్వాత.. విజన్ బోర్డు (Vision Board) ని చూడండి, సానుకూల ధృవీకరణలు (Positive Affirmations) చదవండి. ఇది మీలో సానుకూలతను నింపుతుంది. తద్వారా రోజు కూడా శుభప్రదంగా మొదలవుతుంది.

ఇది కూడా చదవండి: ఉదయం 30 సెకన్ల హగ్‌తో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

 పగటి పూట నోటి నుంచి ఏదైనా ప్రతికూల పదం (Negative word) వచ్చినట్లయితే.. వెంటనే రద్దు చేయండి.. రద్దు చేయండి (Cancel, Cancel) అని చెప్పే అలవాటు చేసుకోవాలి. మీరు దేనిపై ఎక్కువగా దృష్టి సారిస్తే అదే మీ వైపు ఆకర్షిస్తుంది. కాబట్టి.. ప్రతికూలతను అంగీకరించకుండా దాన్ని తక్షణమే రద్దు చేయాలి. అలాగే ఏదైనా ప్రతికూలత ఎదురైతే నన్ను క్షమించండి.. దయచేసి నన్ను క్షమించండి, ధన్యవాదాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను (I am sorry, please forgive me, thank you, and I love you) అని చెప్పడం ద్వారా ఆ ప్రతికూలతను సమతుల్యం చేయండి. రాత్రి 9-10 గంటల ప్రాంతంలో నిద్రపోయే ముందు ధృవీకరణలను (Affirmations) చదవాలని సూచిస్తున్నారు. ఇది మనస్సును సిద్ధం చేస్తుంది.. తద్వారా ఉదయం ప్రేరణతో, సానుకూలతతో మేల్కొంటారు. ఈ దినచర్యను క్రమం తప్పకుండా పాటిస్తే.. కోరుకున్న కోటిని త్వరగా ఆకర్షించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: ఈ ఆకు అమృతం లాంటిది.. దీన్ని తింటే శరీరానికి ఎన్నో లాభాలు

Advertisment
తాజా కథనాలు