/rtv/media/media_files/2025/10/25/hug-2025-10-25-10-55-29.jpg)
hug
ఉదయం లేవగానే ఒకరిని ఆలింగనం చేసుకోవడం (హగ్ చేసుకోవడం) కేవలం ఎమోషనల్ సంజ్ఞ మాత్రమే కాదు.. శరీరానికి, మనసుకు చాలా ప్రయోజనకరం అని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతిరోజూ కొద్ది సెకన్ల పాటు ఆత్మీయులను హత్తుకోవడం ఆరోగ్యం, మానసిక స్థితి, సంబంధాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని హెల్త్‌లైన్ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉదయం 30 సెకన్ల పాటు హత్తుకోవడం వలన అనేక అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 30 సెకన్ల ఆలింగనం వలన ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రేమ కాదు-ఆరోగ్య రహస్యం:
ఒకరిని హత్తుకున్నప్పుడు.. శరీరం ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనిని సంతోషకరమైన హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఒత్తిడి (Reduces Stress), ఆందోళనను తగ్గిస్తుంది. బాధను ఎవరితోనైనా పంచుకున్నప్పుడు మనసుకు కలిగే ఉపశమనంతో సమానంగా ఇది పనిచేస్తుంది. అయితే తమ ప్రియమైన వారిని క్రమం తప్పకుండా ఆలింగనం చేసుకునే వ్యక్తులు తక్కువగా అనారోగ్యానికి గురవుతారని కొన్ని పరిశోధనలలో తేలింది. హత్తుకోవడం వలన శరీరంలో సానుకూల శక్తి పెరిగి, ఒత్తిడి సంబంధిత ప్రతికూల రసాయనాలు తగ్గుతాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రతిరోజూ కొన్ని సెకన్ల పాటు తమ భాగస్వామిని లేదా కుటుంబ సభ్యులను హత్తుకున్న వ్యక్తులలో రక్తపోటు, హృదయ స్పందన రేటు (Heart Rate) సాధారణ స్థాయిలో ఉన్నట్లు అధ్యయనంలో కనుగొనబడింది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సులభమైన మార్గం.
ఇది కూడా చదవండి: పరగడుపున వెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా..? ప్రయోజనాలతోపాటు నష్టాలు ఉన్నాయని తెలుసుకోండి!!
హత్తుకోవడం వలన శరీరంలో ఆక్సిటోసిన్‌తోపాటు సెరోటోనిన్ కూడా విడుదల అవుతుంది. ఇది ఆనందాన్ని ఇస్తుంది. ఉదయం లేవగానే ఒకరిని హత్తుకోవడం రోజును సానుకూలంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది, మనస్సు తేలికగా అనిపిస్తుంది. హగ్ చేసుకోవడం వలన భయం, అభద్రతాభావం (Insecurity), ఒంటరితనం (Reduces Fear and Loneliness) తగ్గుతాయి. మనిషిని మాత్రమే కాకుండా.. టెడ్డీ బేర్‌ను హత్తుకున్నా కూడా మనసుకు విశ్రాంతి లభిస్తుందని పరిశోధనలు కనుగొన్నాయి. అంతేకాకుండా ఆలింగనం వలన శరీరంలోని నరాల వ్యవస్థ (Nervous System) రిలాక్స్ అవుతుంది. దీని వలన నొప్పి, అలసట తగ్గుతాయి. అంటే ఇది సహజమైన వైద్యం చేసే స్పర్శ (Natural Healing Touch) వలె పనిచేస్తుంది. ఈ విధంగా ఉదయం కేవలం 30 సెకన్ల ఆలింగనం ఒకేసారి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ జీవితంలో ఈ చిన్న అలవాటును చేర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పొట్ట కొవ్వు తగ్గాలంటే..30 రోజుల్లో ఈ నూనె ఓ చెంచా తీసుకోండి!!
Follow Us