Onion And Garlic: వెల్లుల్లి, ఉల్లి ఎలా పుట్టాయో తెలుసా..? అసలు కథ ఇదే!!

సముద్ర మంథనం సమయంలో దేవతలు, రాక్షసులు అమృతాన్ని పంచుకునేటప్పుడు.. రాహువు, కేతువు మోసపూరితంగా అమృతాన్ని స్వీకరించారు. విష్ణువు సుదర్శన చక్రంతో వారి తలలను ఖండించినప్పుడు ఆ రక్తపు చుక్కల నుంచి ఉల్లిపాయ, వెల్లుల్లి మొక్కలు పుట్టాయి.

New Update
Onion and garlic

Onion And Garlic

ఉల్లిపాయ(onion), వెల్లుల్లి(garlic) వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే పదార్థాలు. అవి రుచిని పెంచడమే కాకుండా.. హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది. జ్యోతిష్యం, పురాణాల ప్రకారం.. ఈ రెండు కూరగాయలు అత్యంత రహస్యమైన గ్రహాలైన రాహువు, కేతువుతో సంబంధం కలిగి ఉన్నాయి. పురాణ కథనాల ప్రకారం.. సముద్ర మంథనం సమయంలో దేవతలు, రాక్షసులు అమృతాన్ని పంచుకునేటప్పుడు.. రాహువు, కేతువు మోసపూరితంగా అమృతాన్ని స్వీకరించారు. విష్ణువు సుదర్శన చక్రంతో వారి తలలను ఖండించినప్పుడు.. వారి రక్తం నేలపై పడింది. ఆ రక్తపు చుక్కల నుంచి ఉల్లిపాయ, వెల్లుల్లి మొక్కలు పుట్టాయని నమ్ముతారు. అందుకే వీటిని రాహు-కేతువుల సంతానం అని పిలుస్తారు. ఈ కారణం చేత.. వీటిని తామసిక ఆహారంగా చెబుతారు. పూజలు, ధార్మిక కార్యక్రమాలలో వాటిని నిషిద్ధం చేశారు.

జ్యోతిష్య-ఆరోగ్య సంబంధం:

జ్యోతిష్యం(astrology) ప్రకారం.. రాహువు, కేతువు ఇద్దరూ మానవులలో కోరికలు, భ్రమలు, మోహాన్ని పెంచుతారు. ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడం వల్ల ఈ ప్రవృత్తులు పెరుగుతాయని నమ్ముతారు. అందుకే ఆధ్యాత్మిక సాధన చేసేవారు.. ఉపవాస దీక్షలో ఉండేవారు వీటిని తినకుండా ఉంటారు. అయితే వైద్యపరంగా ఈ రెండింటిలోనూ అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. రక్త శుద్ధి, గుండె సంబంధిత వ్యాధులకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా వీటిని మందులుగా ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: ఏసీ గదుల్లో పడుకుంటే పీడకలలు నిజంగానే వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

హిందూ సంప్రదాయంలో నవరాత్రులు, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య వంటి పవిత్ర రోజులలో ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకుండా ఉంటారు. భగవద్గీతలో కూడా ఆహారాన్ని సాత్విక, రాజసిక, తామసిక అనే మూడు రకాలుగా విభజించారు. ఉల్లిపాయ, వెల్లుల్లి తామసిక ఆహారంలోకి వస్తాయి. దేవాలయాలలో ప్రసాదం లేదా నైవేద్యంలో వీటిని ఉపయోగించరు. మొత్తానికి ఉల్లిపాయ, వెల్లుల్లిని ఆధ్యాత్మికంగా పరిహరించడం వల్ల మనస్సు శాంతంగా ఉంటుందని.. రాహు-కేతువుల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. అదే సమయంలో.. వాటి ఔషధ గుణాలను ఆయుర్వేదం, ఆధునిక వైద్యం కూడా గుర్తించాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఆహార పదార్థాలను తినడం లేదా తినకపోవడం అనేది వ్యక్తిగత నమ్మకాలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మీకు బాగా నిద్ర వస్తుందా..? అయితే మీకు ఆ లోపం ఉన్నట్లే.. షాకింగ్ విషయాలు!

అనారోగ్యం సమస్య నుంచి బయటపడటానికి ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం మంచిదని చెబుతారు. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని తరచుగా తింటే గుండె ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి రక్షిస్తాయి. అందువల్ల రోజూ ఉల్లిపాయ, వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

Advertisment
తాజా కథనాలు