/rtv/media/media_files/2025/11/04/karthika-pournami-2025-2025-11-04-13-15-17.jpg)
karthika pournami 2025
కార్తీక పౌర్ణమి(Karthika Pournami 2025)ని ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన భక్తులు జరుపుకుంటున్నారు. అయితే చంద్రుడు, గురువు ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి ఈ కార్తీక పౌర్ణమి నుంచి గజకేసరి యోగం పట్టనుంది. అయితే ఆ రాశులేవో(zodiac-signs) మరి ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : లవంగం నీటితో ఎన్ని లాభలో తెలిస్తే తాగకుండా ఉండలేరు మరి.. ఎలా తాగాలో.. ఎప్పుడు తాగాలో చదివి తెలుసుకోండి
మేషం
కార్తీక పౌర్ణమి ఈ మేష రాశిలో ఏర్పడుతోంది. అలాగే కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో గురువు ఉండటంతో వీరికి ఇకపై గజకేసరి యోగం ఏర్పడుతోంది. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మనస్సులో ఉన్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. రాజ, ధన యోగం కలుగుతుంది. అలాగే మానసికంగా కూడా సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.
మిథునం
ఈ రాశి వారికి కార్తీక పౌర్ణమి నుంచి అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగం, డబ్బు ఇలా అన్నింట్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి. అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. ఆర్థికంగా అన్ని సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. 
కర్కాటకం
గణపతి, శివుడిని ఈ రాశి వారు పూజించడం వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. ఏ వ్యాపారం చేపట్టినా కూడా లాభాలు వస్తాయి. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. 
తులా రాశి
వీరికి సప్తమ స్థానంలో చంద్రుడి బలం పెరగడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీంతో అదృష్ట యోగం పట్టే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అయితే ఎలాంటి సమస్యలు రావని పండితులు చెబుతున్నారు.
మకర రాశి
ఉచ్చ స్థానంలో గురువు కారణంగా ఈ రాశి వారికి గజకేసరి యోగం ఏర్పడనుంది. దీనివల్ల వీరికి అన్ని విధాలుగా మంచి జరగనుంది. ముఖ్యంగా శివార్చన ఈ రాశి వారు చేస్తే సంతానం కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 
మీనరాశి
వీరికి రాశ్యధిపతి గురువుతో గజకేసరి యోగం ఏర్పడనుంది. దీనివల్ల వీరికి అపర కుబేర యోగం ఏర్పడనుంది. అయితే వీరు సుబ్రహ్మణ్య అష్టకం పటించడం లేదా పూజ చేయడం వల్ల వీరికి అన్ని విధాలుగా మంచి జరగనుందని పండితులు అంటున్నారు.
Also Read : రాగి.. ఇత్తడి పాత్రలు తళతళ మెరవాలా..? అయితే ఈ కిటుకు తెలుసుకోండి!!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
 Follow Us