/rtv/media/media_files/2025/11/03/copper-and-brass-utensils-2025-11-03-20-11-39.jpg)
Copper and brass utensils
చాలామంది ఇళ్లల్లో పూజలు, అలంకరణ కోసం ఇత్తడి, రాగి, లేదా కాంస్య పాత్రలు, వస్తువులను ఉపయోగిస్తుంటారు. అయితే కాలక్రమేణా గాలి తగిలి, ఈ పాత్రలు నల్లబడటం లేదా కళావిహీనంగా మారడం సహజం. వాటిని మార్కెట్లో శుభ్రం చేయించడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ సమస్యకు పరిష్కారం కోసం.. ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతో ఈ పాత్రలను కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో తెలిపే ఒక అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. 1 నిమిషంలో పాత్రలను శుభ్రం చేసే అద్భుతమైన మిశ్రమ తయారీ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మెరిసే పూజాపాత్రల కోసం..
సాధారణ శుభ్రత తర్వాత పాత్రలు మళ్లీ నల్లబడటం ప్రారంభిస్తే.. కేవలం నిమిషాల్లోనే పాత పాత్రలు మెరిసిపోతాయి. దీనికి కావాల్సిన వస్తువులు.. తెల్ల ఉప్పు (White Salt) ఒక టీస్పూన్, సిట్రిక్ యాసిడ్ లేదా నిమ్మపువ్వు (Lemon Flower) రెండు టీస్పూన్లు, డిష్‌వాషింగ్ లిక్విడ్ ఒక టీస్పూన్, తెల్ల వెనిగర్ (White Vinegar) రెండు టీస్పూన్లు, నీరు (Water): అవసరమైనంత తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ ఉప్పు, రెండు లేదా రెండున్నర టేబుల్ స్పూన్ల నిమ్మపువ్వు (సిట్రిక్ యాసిడ్) వేయాలి. దీనికి ఒక టీస్పూన్ డిష్‌వాషింగ్ లిక్విడ్, రెండు నుంచి రెండున్నర టీస్పూన్ల తెల్ల వెనిగర్‌ను కలిపి బాగా కలపాలి. కొద్దిగా నీరు కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమం సిద్ధమైన తర్వాత నల్లబడిన రాగి, ఇత్తడి, కాంస్య పాత్రలను అందులో ముంచాలి లేదా స్పూన్‌తో వాటిపై పోయాలి. ఇలా చేయటం వల్ల పాత్రలు మెరుస్తాయి. 
 ఇది కూడా చదవండి: మీరు వేడి నీటితో స్నానం చేస్తారా..?.. అయితే మీకో షాకింగ్ న్యూస్!!
అధికంగా నల్లబడిన ప్రాంతాలలో ఈ ద్రావణాన్ని ఉపయోగించి మెల్లగా రుద్దాలి. పైన చెప్పిన పద్ధతి కాకుండా ఇంట్లో ఉండే మరో రెండు సులభమైన పదార్థాలతో కూడా ఈ పాత్రలను శుభ్రం చేయవచ్చు. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక నిమ్మకాయ రసంతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మ తొక్క (Peel) సహాయంతో పాత్రలపై రుద్ది శుభ్రం చేయాలి. అంతేకాకుండా చింతపండు గుజ్జు (Tamarind)ను ఉపయోగించి కూడా ఈ పాత్రలను శుభ్రం చేయవచ్చు. దీనితో కూడా పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి. ఈ చిట్కాలు పూజాపాత్రలను తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలో శుభ్రపరచడానికి సహాయపడతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: చలికాలం ఆహారం ఏ పిండి తినాలో.. తినకూడదో తెలుసుకోండి!!
 Follow Us