Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నాడు ఈ బిగ్ మిస్టేక్స్ చేస్తున్నారా.. అయితే మీ పుణ్యం పాపమైపోయనే!

కార్తీక పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో చీకటిగా ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఇళ్లు దీపాలతో బాగా కనిపించేలా అలంకరించుకోవాలని పండితులు చెబుతున్నారు.

New Update
karthikapournami7

Karthika Pournami 2025

కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. ఈ పౌర్ణమి నాడు భక్తులు ఎంతో పవిత్రంగా పూజ చేస్తారు. ముఖ్యంగా నది స్నానం, దీపారాధన వంటివి ఎక్కువగా చేస్తుంటారు. వీటివల్ల కోరిన కోరికలు నెరవేరి, పాపమంతా పోతుందని పండితులు చెబుతుంటారు. అయితే ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమిని జరుపుకుంటున్నారు. అయితే కొందరికి తెలియక కార్తీక పౌర్ణమి నాడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. దీనివల్ల వారికి రావాల్సిన ఎంత పుణ్యమైనా కూడా పాపమవుతుందని పండితులు అంటున్నారు. అయితే కార్తీక పౌర్ణమి నాడు చేయకూడని ఆ మిస్టేక్స్ ఏంటో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Chhath Puja Fasting: ఛత్‌ పూజ ఉపవాసానికి ముందు... శక్తి, తేమ కోసం ఈ పానీయాలు తప్పనిసరి

చేయకూడని పనులు

కార్తీక పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో చీకటిగా ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఇళ్లు దీపాలతో బాగా కనిపించేలా అలంకరించుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదని పండితులు అంటున్నారు. అలాగే పేద వారికి సాయం చేయాలని, ఇంటికి వచ్చిన వారిని అసలు ఖాళీగా పంపకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ఇతరులను అవమానించకూడదని, అసభ్యకరంగా మాట్లాడకూడదని పండితులు అంటున్నారు. పౌర్ణమి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు వస్త్రం, పేద వారికి ఆహారం, బెల్లం వంటివి దానం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని నిపుణులు అంటున్నారు. 

చేయాల్సిన పనులు
కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. అలా 365 వత్తులు వెలిగించడం వలన సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం వెలిగించకపోయినా కోల్పోయిన పుణ్యాన్ని తిరిగి పొందవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా మంచి జరుగుతుంది. నారాయణుడిని, శివుడిని కలిసి పూజిస్తే విశేష ఫలితాలను పొందవచ్చుని పండితులు అంటున్నారు. కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించాలి. నదిలో దీపాలను దానం చేస్తే మంచిది. అలా కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే బెల్లం, దుస్తులు వంటివి దానం చేయడం వల్ల అంతా శుభమే జరుగుతుందని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Today Horoscope: ఈ రాశుల వారికి బిగ్ అలర్ట్.. కష్టాలు, కోట్ల నష్టం అడుగడున సమస్యలే!

Advertisment
తాజా కథనాలు