/rtv/media/media_files/2025/09/16/insomnia-2025-09-16-20-35-36.jpg)
Insomnia
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి(daily-life-style) కారణంగా చాలా మంది నిద్ర(good-sleeping) కు దూరం అవుతున్నారు. రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడంతో అల్లాడిపోతున్నారు. ఉదయం ఉద్యోగాలు చేయడం, రాత్రి నిద్రకు కరువవ్వడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలా నిద్ర పట్టకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
అతిగా తినడం లేదా అసలు తినకపోవడం:
నిద్రపోయే ముందు భారీగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. దీనివల్ల కడుపులో అసౌకర్యం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు నిద్ర పట్టకుండా చేస్తాయి. అలాగే రాత్రి పూట ఏమీ తినకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆకలి వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రపోయేందుకు రెండు గంటల ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.
Also Read : నడుము నుంచి పాదాల వరకు తీవ్రమైన నొప్పా..? విస్మరిస్తే జీవితాంతం సమస్యలు తప్పవు!!
టీ, కాఫీ తాగే అలవాటు
చాలా మందికి రాత్రిపూట టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, వీటిలో ఉండే కెఫిన్ వల్ల మెదడు చురుగ్గా మారి, నిద్ర రాకుండా చేస్తుంది. అలాగే ఆల్కహాల్ తీసుకుంటే మొదట నిద్ర వస్తున్నట్లు అనిపించినా, తర్వాత నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే పడుకునే ముందు కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి.
మొబైల్, టీవీ ఎక్కువగా చూడటం
స్మార్ట్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల స్క్రీన్ల నుండి వచ్చే నీలికాంతి నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల మెదడు నిద్రకు సిద్ధం కాదు. అందుకే నిద్రపోయే ముందు కనీసం ఒక గంట ముందు స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి. బదులుగా పుస్తకాలు చదవడం లేదా మెడిటేషన్ చేయడం మంచిది.
ఒత్తిడి, ఆందోళన:
రోజువారీ పనుల గురించి లేదా సమస్యల గురించి ఆలోచిస్తూ పడుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండదు. దీనివల్ల నిద్ర పట్టదు. కాబట్టి పడుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. యోగా, ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఒకే సమయానికి పడుకోకపోవడం:
ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం వల్ల శరీరానికి ఒక క్రమమైన అలవాటు ఏర్పడుతుంది. ఈ అలవాటును పాటించకపోతే, నిద్రకు ఆటంకం కలుగుతుంది. సెలవు రోజుల్లో కూడా ఇదే పద్ధతిని పాటిస్తే నిద్ర సమస్యలు రావు.
ఈ తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా, మంచి నిద్రను పొందవచ్చు. మంచి నిద్ర మన ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్ర లేమి వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ చిట్కాలను పాటించడం మంచిది.
Also Read : చిగుళ్ల నుంచి రక్తస్రావమా..? అయితే గుండెజబ్బు లేక మధుమేహం కావొచ్చు..!!