/rtv/media/media_files/2025/09/13/stomach-acidity-2025-09-13-19-30-35.jpg)
stomach Acidity
కడుపులో మంట, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు కారణమయ్యే ఒక సాధారణ జీర్ణ సంబంధ సమస్యే ఎసిడిటీ. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడానికి కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు ఇది సంభవిస్తుంది. దీన్ని గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) అని కూడా అంటారు. మనం తీసుకునే ఆహారం, చెడు జీవనశైలి అలవాట్లు, అధిక బరువు, ఒత్తిడి వంటివి ఎసిడిటీకి ప్రధాన కారణాలు. ఎసిడిటీ వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి కారణంగా ఎదురయ్యే సాధారణ సమస్యలలో ఎసిడిటీ ఒకటి. ఆలస్యంగా భోజనం చేయడం లేదా అధిక మసాలాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. గుండెలో మంట, పుల్లటి త్రేన్పులు, కడుపులో మంట ఎసిడిటీకి ప్రధాన లక్షణాలు. చాలామంది ఈ సమస్యకు వెంటనే మందుల మీద ఆధారపడతారు. కానీ సరైన ఆహార పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మందులు లేకుండానే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆహారాలలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఎసిడిటీని తగ్గించే ఆహారాలు:
అరటిపండు:అరటిపండు కడుపులో మంటను, ఎసిడిటీని తక్షణమే తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, యాసిడ్‌ను తటస్థం చేయడానికి సహాయపడుతుంది.
చల్లటి పాలు: తరచుగా ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు చల్లటి పాలు తాగడం చాలా ఉపయోగకరం. పాలలో ఉండే కాల్షియం కడుపులోని యాసిడ్‌ను నియంత్రించి, తక్షణ ఉపశమనం ఇస్తుంది.
సోంపు:సోంపు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా గ్యాస్, ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. సోంపును నీటిలో మరిగించి తాగడం ద్వారా మరింత మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇది కూడా చదవండి: రాత్రి పూట అన్నం తింటే మంచిదా..? రోటీ తింటే మంచిదా..?
కొబ్బరి నీళ్లు:కొబ్బరి నీళ్లు శరీరానికి తేమను అందించి, కడుపులోని మంటను శాంతపరుస్తాయి. ఈ తేలికైన, సహజసిద్ధమైన పానీయం ఎసిడిటీకి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఓట్స్:ఓట్స్ ఫైబర్ పుష్కలంగా ఉండి త్వరగా జీర్ణమవుతాయి. అల్పాహారంలో ఓట్స్ తీసుకోవడం వల్ల కడుపు తేలికగా ఉంటుంది. తద్వారా ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
దోసకాయ: దోసకాయ శరీరాన్ని చల్లబరిచి కడుపులోని యాసిడ్‌ను సమతుల్యం చేస్తుంది. దీన్ని సలాడ్‌లో భాగం చేసుకోవడం ఎసిడిటీని నివారించడానికి గొప్ప మార్గం.
అల్లం:అల్లం జీర్ణక్రియను మెరుగుపరచి.. ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం టీలో వేసుకుని లేదా పచ్చిగా నమలడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మందులు వాడకుండానే ఎసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. నివారణకు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:ఆ దేశాల్లో పిల్లలు లావు పెరగడం గురించి యూనిసెఫ్ నివేదిక ఏం చెబుతుందో మీరు తెలుసుకోండి