Child Obesity: ఆ దేశాల్లో పిల్లలు లావు పెరగడం గురించి యూనిసెఫ్ నివేదిక ఏం చెబుతుందో మీరు తెలుసుకోండి

ప్రపంచంలో సుమారు 188 మిలియన్ల మంది పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇది వారి ఆరోగ్యం, శారీరక, మానసిక ఎదుగుదలకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని UNICEF హెచ్చరించింది. అయితే జంక్ ఫుడ్‌ నిషేధం విధించటం వల్ల సమస్య తగ్గుతుంది.

New Update
Child Obesity

Child Obesity

ప్రపంచవ్యాప్తంగా పిల్లల పోషకాహార లోపంపై కొత్త హెచ్చరికను జారీ చేసింది. పిల్లలు బరువు తక్కువగా ఉండటం కంటే స్థూలకాయంతో బాధపడుతున్నారని UNICEF తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇది చరిత్రలో మొదటిసారి జరిగిన పరిణామని నివేదిక పేర్కొంది. అల్ట్రా-ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్ పిల్లల ఆహారంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని.. ఇది వారి ఆరోగ్యం, శారీరక, మానసిక ఎదుగుదలకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని UNICEF హెచ్చరించింది. ప్రపంచంలో ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు అంటే సుమారు 188 మిలియన్ల మంది పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. నివేదిక ప్రకారం.. 5 నుంచి 19 సంవత్సరాల వయస్సు పిల్లల్లో 9.2 శాతం మంది బరువు తక్కువగా ఉండగా.. 9.4 శాతం మంది స్థూలకాయంతో ఉన్నారని తెలుపుతున్నారు. 

పిల్లల్లో ఎక్కువగా ఊబకాయం..

2000వ సంవత్సరంలో సుమారు 13 శాతం మంది పిల్లలు బరువు తక్కువగా ఉండగా.. కేవలం 3 శాతం మంది మాత్రమే స్థూలకాయంతో ఉండేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్థూలకాయం పోషకాహార లోపం కంటే పెద్ద ముప్పుగా మారింది. ఇది బరువు తక్కువగా ఉన్న పిల్లల గురించి మాత్రమే కాదని.. స్థూలకాయంతో బాధపడుతున్న పిల్లల గురించి కూడా ఆందోళన చెందాలని నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్స్ పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ల స్థానంలోకి వస్తున్నాయి. ఇది పిల్లల ఎదుగుదలకు, మానసిక ఆరోగ్యానికి అత్యంత కీలకమైన పోషకాలను దూరం చేస్తోంది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ స్నాక్స్, చక్కెర పానీయాలు, బిస్కెట్లు, కేకులు, రెడీ-టు-ఈట్ మీల్స్ పిల్లల ఆహారంలో ఎక్కువగా చేరుతున్నాయి. వీటిలో చక్కెర, కొవ్వు, ఉప్పు అధికంగా ఉంటాయి. నియు కుక్ ఐలాండ్స్‌లో 5-19 సంవత్సరాల వయస్సు పిల్లల్లో స్థూలకాయం రేటు అత్యధికంగా ఉంది. ఈ ధనిక దేశాల్లోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. చిలీలో 27%, అమెరికా, యూఏఈలో 21% మంది పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. 2000 సంవత్సరంలో 9 శాతంగా ఉన్న స్థూలకాయం రేటు 2022 నాటికి 11 శాతానికి పెరిగింది. 

ఇది కూడా చదవండి: ఈ తైలం రాయండి పాదాల నొప్పి నుంచి వారంలోగా ఉపశమనం పొందండి

గత 20 ఏళ్లలో స్థూలకాయం ఉన్న అమ్మాయిల సంఖ్య రెట్టింపు అయి 13 శాతానికి చేరుకుందని చెబుతున్నారు. ఇక్కడ ప్రతి 8 మంది పిల్లల్లో ఒకరు స్థూలకాయంతో ఉండగా.. ప్రతి నలుగురిలో ఒకరు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని చెబుతున్నారు. పిల్లల్లో స్థూలకాయం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని నివేదిక హెచ్చరించింది. పాఠశాలలు, మార్కెట్లు జంక్ ఫుడ్‌తో నిండిపోయాయని.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వీటి మార్కెటింగ్ పిల్లలను, తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని నివేదిక తెలిపింది. అయితే జంక్ ఫుడ్‌పై లేబులింగ్, పన్నులు విధించటం, పాఠశాలల్లో వాటి అమ్మకాలు, ప్రకటనలపై నిషేధం విధించటం వల్ల సమస్య తగ్గుతుంది. పేద కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి మెరుగైన ప్రణాళికలు రూపొందించాలని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. నివారణకు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ప్లేట్‌లో ఆహారం ఉంచితే ఇలా జరుగుతుంది అంట!!

Advertisment
తాజా కథనాలు